HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Key Comments At Cii Summit

CM Chandrababu: రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్ర‌బాబు

ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

  • Author : Gopi Date : 30-05-2025 - 9:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ‘ఆర్థికాభివృద్ధి – సుస్థిరత – ఆంధ్రప్రదేశ్ బ్లూప్రింట్’ అనే అంశంపై జరిగిన సీఐఐ స్పెషల్ ప్లీనరీ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, రూపొందించిన విధానాలను వివరించారు. స్వర్ణాంధ్ర విజన్-2047లో పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కోరుతూ ఆయన విజ్ఞప్తి చేశారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ప్రస్తుతం సీబీఎన్ బ్రాండ్ ద్వారా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం. క్రెడిబిలిటీ రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఏపీకి రండి, పరిశీలించండి, ఆ తర్వాత పెట్టుబడులు పెట్టండి. 2026లో దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటవుతుంది. దీన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ విస్తరిస్తోంది. డ్రోన్స్, ఐఓటీ, సెన్సార్ల వంటి సాంకేతికతలతో రియల్-టైమ్ డేటా అందుబాటులోకి వస్తోంది. ఈ రంగాల్లో పెట్టుబడిదారులు అవసరం. భవిష్యత్తులో ఈ రంగానికి గొప్ప డిమాండ్ ఉంటుంది. అమరావతి దీనికి కేంద్రంగా నిలుస్తుంది. టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ సంస్థలు సంయుక్తంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నదే మా నినాదం. బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నంలో ఏర్పాటవుతోంది. విశాఖలో డేటా సెంటర్, అనలిటిక్స్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని గూగుల్‌ను ఆహ్వానించాం. పారిశ్రామికవేత్తలు ఎవరు వచ్చినా ఎర్ర తివాచీతో స్వాగతిస్తాం. దరఖాస్తు నుంచి భూ కేటాయింపు, అనుమతుల వరకు రికార్డు సమయంలో క్లియరెన్సులు ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఏపీ సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రంగా మారుతోంది. ఈ రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం, 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చే లక్ష్యం ఉంది. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం, ఇది భవిష్యత్ నాయకులను తయారు చేస్తుంది” అని పారిశ్రామికవేత్తలకు వివరించారు.

Also Read: CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!

నాడు-నేడు: ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు తెచ్చిన అనుభవాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. “దావోస్ వంటి సదస్సులకు వెళ్తే ఓట్లు రావని కొందరు అన్నారు. అయినా ఉమ్మడి ఏపీ కోసం ఓట్లను పట్టించుకోకుండా ధైర్యంగా వెళ్లాను. 1995 నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సులకు నిరంతరం హాజరవుతున్నాను. ప్రజా జీవితంలో ఉన్నవారు సంపద సృష్టించాలి. సంపద పెరిగితేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలం. హైదరాబాద్‌లో సీఐఐ సహకారంతో గ్రీన్ బిల్డింగ్ నిర్మించాం, బహుళ పెట్టుబడి సదస్సులు నిర్వహించాం. ఇప్పుడు హైదరాబాద్ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరంగా నిలిచింది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నిర్ణయాలను అభినందిస్తాను. 1990 తర్వాత సమాచార, ఇంటర్నెట్ విప్లవం మొదలైంది. ఏపీలో అప్పటి సంస్కరణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారే ఉన్నారు. నా అరెస్ట్ సమయంలో 80 దేశాల్లో తెలుగు ఐటీ ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారు, అప్పుడే వారి విస్తృతి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నాను. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన నాకు అమరావతిని గ్లోబల్ గ్రీన్ సిటీగా నిర్మించే అవకాశం వచ్చింది. ఇందులో పరిశ్రమల భాగస్వామ్యం కోరుతున్నాం. 15 శాతం వృద్ధి రేటుతో ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని, తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని వివరించారు.

స్టాండింగ్ ఓవేషన్‌తో సత్కారం

సీఎం చంద్రబాబు ప్రసంగం, పారిశ్రామికవేత్తల ప్రశ్నలకు సమాధానాలు సీఐఐ సదస్సులో స్టాండింగ్ ఓవేషన్‌తో గౌరవించబడ్డాయి. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అధ్యక్షుడు సంజీవ్ పురి, తదితరులు ఆయనను సత్కరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • CII Summit
  • CM Chandrababu
  • delhi

Related News

A Royal Dream for Seema... The Roar of the AMCA in Puttaparthi

Puttaparthi: సీమకు రాయల్ కల…. పుట్టపర్తిలో AMCA గర్జన!

పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది. కొంతకాలంగా భారీ పెట్టుబడులు ఒక్కొక్కటిగా రాయలసీమలో అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో సీమ రూపురేఖలు మారబోతుండగా, మరోవైపు పుట్టపర్తి వేదికగా దేశ రక్షణ రంగంలోనే అత్యంత కీలకమైన AMCA ప్రాజెక్టుకు అడుగులు పడుతుండటం సంచలనంగా మారింది. రాయలసీమను ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్

  • Free Mineral Water Plant Inaugurated in Lakshmipuram

    Lakshmipuram: లక్ష్మీపురంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం..

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd