HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Good News For Ntr Fans Time Fixed For The God Of War Announcement

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

  • Author : Vamsi Chowdary Korata Date : 29-06-2026 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.
Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్‌లో భారీ స్కేల్‌లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు. సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పి, అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుందని అన్నారు కానీ, ఇంతవరకూ ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. దీంతో అసలు సినిమా ఉంటుందా లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి టైమ్‌లో ఉన్నట్టుండి ఇప్పుడు తాజాగా నాగవంశీ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

“ఫైనల్లీ.. నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజు రేపే’’ అంటూ నాగవంశీ ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దీనికి ఒక నెమలి ఎమోజీని జోడించారు. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ స్పందిస్తూ.. నెమలి ఎమోజీతో పాటుగా కొత్త ప్రారంభాన్ని సూచించేలా పోస్ట్ పెట్టారు. ఇక్కడ నాగవంశీ ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. సినిమా గురించి అని కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ ‘నెమలి’ ఎమోజీని యాడ్ చేయడంతో, ఇది కచ్చితంగా ఎన్నాళ్లుగానో వార్తల్లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గాడ్ ఆఫ్ వార్’ గురించే అని సినీ అభిమానులు భావిస్తున్నారు. తారక్ – త్రివిక్రమ్ కాంబోలో జూన్ 29న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అప్పట్లో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించారు. బన్నీ కోసం ఒక అద్భుతమైన మైథలాజికల్ కథను రెడీ చేసినట్లుగా చెప్పుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రూపొందనున్నట్లు టాక్ వచ్చింది. అప్పుడే నాగవంశీ ఈ సినిమా గురించి హింట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ”మోస్ట్ పవర్ ఫుల్ దేవుళ్లలో ఒకరిగా నాకు అత్యంత ఇష్టమైన అన్నయ్య కనిపించబోతున్నారు” అని ఒక ట్వీట్.. ”గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్” అంటూ మరో ట్వీట్ చేశారు. వీటికి రెండు సంస్కృత శ్లోకాలను కూడా జత చేశారు.

కుమార స్వామిని ‘గాడ్ ఆఫ్ వార్’ అని పిలుస్తారు. ఆయనకే సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్, కార్తికేయ స్వామి, స్కంధుడు వంటి మరికొన్ని పేర్లు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ ఒక సందర్భంలో చేతిలో మురుగన్ పుస్తకం పట్టుకొని మీడియా కంట పడ్డారు. దాంతో కుమార స్వామిగా తారక్ కనిపించబోతున్నారని, దాని కోసమే ప్రిపరేషన్ మొదలుపెట్టారని టాక్ నడిచింది. కానీ త్రివిక్రమ్ – తారక్ ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయారు. ఇప్పుడు సడన్‌గా మోస్ట్ అవైటెడ్ డే అంటూ నాగవంశీ పోస్ట్ పెట్టడంతో.. గాడ్ ఆఫ్ వార్ మరోసారి వార్తల్లో నిలిచింది. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CinemaUpdates
  • jr ntr
  • Nagavamshi
  • SS Thaman
  • tollywood
  • Trivikram

Related News

‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం ప

    Latest News

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd