HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Agreement To Halt Attacks Between The Us And Iran

Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

  • Author : Vamsi Chowdary Korata Date : 29-06-2026 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.
Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పంద చర్చలు జరిగిన కొద్ది రోజులకే మళ్లీ అమెరికా – ఇరాన్ మధ్య క్షిపణి దాడులు జరిగాయి. ఈ సారి భీకరంగా జరిగిన దాడుల్లో ఇరు దేశాలు నష్టపోయాయి. ఇరాన్‌లోని కీలక స్థావరాలను టార్గెట్ చేసుకుని అమెరికా మిస్సైల్స్ ప్రయోగించగా.. కువైట్, బహ్రాయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అయితే, ఇరు దేశాలు ప్రస్తుతం తాత్కాలికంగా దాడులు నిలిపివేసి మళ్లీ చర్చల బాట పట్టాయి.

ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం సమావేశమై హార్మూజ్ జలసంధి వివాదంపై చర్చించేందుకు అమెరికా – ఇరాన్ దేశాలు అంగీకరించినట్లు సమాచారం. యుద్ధ విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ వీకెండ్‌లో అమెరికా, ఇరాన్ మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నాయి. దాంతో మిడిల్ ఈస్ట్‌లో ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి.

హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడమే మళ్లీ ఉద్రిక్తతలకు కారణం. ఈ దాడులకు ఇరాన్ కారణమంటూ అమెరికా ఆరోపిస్తూ.. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. అయితే, వాణిజ్య నౌకలపై జరిగిన తొలి దాడికి తమకూ ఎలాంటి సంబంధం లేదంటూ ఇరాన్ ఖండించింది.

ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అమెరికా దాడులు పరస్పర అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. అందుకే క్షిపణి, డ్రోన్, రాడార్ కేంద్రాలపై దాడులు చేసినట్లు సమర్థించుకున్నారు.

ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు దేశాలు తాత్కాలికంగా సైనిక దాడులు నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ సైనిక చర్యలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మరో అధికారి మాట్లాడుతూ ఇకపై హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని చెప్పారు.

ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం జరగనున్న చర్చల్లో హార్మూజ్ జలసంధి సమస్యపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తొలుత ఈ చర్చలు స్విట్జర్లాండ్‌లో నిర్వహించి ఇరాన్ అణు కార్యక్రమం గురించి చర్చించాలని అనుకున్నారు. కానీ హార్మూజ్‌లో ఏర్పడిన ఉద్రిక్తతతో దోహాలో చర్చించేందుకు నిర్ణయించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donal Trump
  • G7 Summit
  • US - Iran War

Related News

Iran first attacked a power and water desalination plant in Kuwait, and then issued a stern warning.

Kuwait Desalination Plant: ఇరాన్ మొదట కువైట్ విద్యుత్, నీటి డీశాలినేషన్ ప్లాంట్ పై దాడి.. ఆపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది..

కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సహాయక స్థావరాలపై ఐఆర్‌జిసి నౌకాదళం దాడి కువైట్‌లోని క్యాంప్ అరిఫ్జాన్‌లో ఉన్న అమెరికా సైనిక లాజిస్టిక్స్ కేంద్రాన్ని ఐఆర్‌జిసి లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో అక్కడ మోహరించిన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐఆర్‌జిసి పేర్కొంది. పశ్చిమ ఆసియాలో తాజాగా జరుగుతున్న కాల్పుల మార్పిడి నేపథ్యంలో, అమెరికా సైన్యంతో సంబంధం ఉన్న సౌకర్యాలకు ఆతి

  • Countdown to a major war? Iran warns of 'Zero Hour'… US prepares to send fighter jets to Israel.

    Donald Trump: పెద్ద యుద్ధానికి కౌంట్‌డౌన్? ‘జీరో అవర్’ గురించి ఇరాన్ హెచ్చరిక.. ఇజ్రాయెల్‌కు యుద్ధ విమానాలను పంపేందుకు అమెరికా సన్నద్ధం

  • Trump warns Iran again.

    Donal Trump: ఇరాన్‌కు మరోసారి ట్రంప్‌ వార్నింగ్‌

Latest News

  • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

  • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

  • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

  • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd