HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know What Happens If There Is A Calcium Deficiency

Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

  • Author : Vamsi Chowdary Korata Date : 29-06-2026 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do you know what happens if there is a calcium deficiency?
Do you know what happens if there is a calcium deficiency?

కాల్షియం మన శరీరంలో ఒక కీలకమైన పోషక పదార్థం. నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపే శరీర విధులకు కాల్షియం ముఖ్యం. ఇంకా హార్మోన్ల స్రావం, కండరాలు మరియు నరాల సంకోచ వ్యాకోచాలకు కాల్షియం ఎంతగానో అవసరం. ముఖ్యంగా అస్థిపంజర పనితీరుకు కాల్షియమే ఆధారం. అయితే కొందరిలో పలు కారణాల వల్ల కాల్షియం లోపిస్తుంటుంది.

దీన్ని వైద్య పరిభాషలో హైపోకాల్సీమియా అంటారు. హైపోకాల్సీమియాకు చికిత్స తీసుకోనట్లయితే… ఆస్టియోపెనియా అనే ఎముకలు సన్నబడే వ్యాధి, పిల్లల్లో బలహీనమైన ఎముకలు మరియు ఎముక సాంద్రత కోల్పోయే వ్యాధి వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అయితే ఆహార అలవాట్లలో మార్పులు చేసినట్లయితే… కాల్షియం లోపాన్ని నివారించవచ్చు.

కాల్షియం లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

  1. పాదాలు, వేళ్లు, కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి.
  2. కండరాలలో తిమ్మిర్లు లేదా కండరాలు పట్టేయడం.
  3. బద్ధకం, అలసట.
  4. బలహీనంగా, పెళుసుగా ఉండే గోర్లు.
  5. దంత సమస్యలు.
  6. గందరగోళంగా అనిపించడం.
  7. ఆకలి మందగించడం.

ఇక కాల్షియం దీర్ఘకాలికంగా లోపిస్తే అనేక ఇతర శరీర భాగాలను బాధిస్తుంది. అందుకే మనకు పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినట్లయితే పరీక్ష చేయించుకుని, లోపం ఉందని నిర్ధారణ అయితే తగిన మందులు వాడటం మంచిది. లేదంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.

నివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు..!!

  1. పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు, పులియబెట్టిన పెరుగు, పన్నీర్, రసమలై.
  2. బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ, పప్పుధాన్యాలు, బీన్స్, బఠానీలు.
  3. మినరల్ వాటర్.
  4. సీఫుడ్, కొవ్వులేని మాంసం, గుడ్లు.
  5. ఖర్జూరం తీసుకోవడం మంచిది.

కాల్షియం పుష్కలంగా ఉంటే ఎముకలు బలంగా ఉంటాయి. దంతాలు, గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి కాల్షియం లోపించకుండా చూసుకోవడం ముఖ్యం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • calcium deficiency
  • health care tips
  • hypocalcemia
  • proper food

Related News

Regular Sugar vs. Monk Fruit: Which is better for blood sugar levels?

Regular Sugar vs. Monk Fruit: సాధారణ చక్కెర vs. మాంక్ ఫ్రూట్: రక్తంలో చక్కెర స్థాయికి ఏది మంచిది?

మాంక్ ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు, అందువల్ల ఇది సాధారణ చక్కెరలకు మంచి ప్రత్యామ్నాయం. సాధారణ చక్కెరలా కాకుండా, మాంక్ ఫ్రూట్‌లో కేలరీలు ఉండవు. మాంక్ ఫ్రూట్‌లోని సంకలితాలు జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మాంక్ ఫ్రూట్ సాధారణ చక్కెర కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం, ఎందుకంటే ఇది గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను కలిగించ

    Latest News

    • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

    • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

    • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

    • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

    • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd