Pakistan: పాకిస్థాన్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 15 మంది దుర్మరణం
పాకిస్థాన్ (Pakistan)లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి 15 మంది మరణించారని (15 Dead) పోలీసులు తెలిపారు.
- By Gopichand Published Date - 06:44 AM, Tue - 16 May 23

పాకిస్థాన్ (Pakistan)లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి 15 మంది మరణించారని (15 Dead) పోలీసులు తెలిపారు. కోహట్ జిల్లాలోని దర్రా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో ఉన్న సన్నీఖేల్, జర్ఘున్ ఖేల్ తెగల మధ్య గని డీలిమిటేషన్ విషయంలో ఘర్షణ జరిగిందని వారు చెప్పారు. మృతదేహాలను, క్షతగాత్రులను పేషావర్ ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు.
పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో సోమవారం బొగ్గు గనిని గుర్తించే విషయంలో జరిగిన రక్తపాత ఘర్షణల్లో కనీసం 15 మంది మరణించారు. పెషావర్‌కు నైరుతి దిశలో 35 కిలోమీటర్ల దూరంలోని కోహట్ జిల్లాలోని దర్రా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాలను, క్షతగాత్రులను పెషావర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గాయపడిన వారి సంఖ్యను వెంటనే నిర్ధారించలేమని పోలీసులు తెలిపారు. అయితే ఇరువర్గాల నుండి కాల్పులు జరపడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర భద్రతా బలగాల సంయుక్త బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యర్థి తెగల మధ్య కాల్పులను నిలిపివేసినట్లు అధికారి తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేశారు
ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర భద్రతా బలగాల సంయుక్త బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యర్థి తెగల మధ్య కాల్పులను నిలిపివేసినట్లు అధికారి తెలిపారు. దర్రా ఆడమ్ ఖేల్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది
బొగ్గు గని డీలిమిటేషన్ విషయంలో రెండు తెగల మధ్య గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోందని, ప్రతిష్టంభనను సరిదిద్దేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.