Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు..!
గతనెల భూకంపంతో భారీ ప్రాణనష్టం చవిచూసిన టర్కీలో మరోసారి భూమి కంపించింది. గోక్సన్ జిల్లాలో సంభవించిన ఈ భూకంపం (Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. కాగా ఆ దేశంలోని సన్లీయుర్ఫా, అడియామన్ ప్రావిన్స్‌లో ఇటీవల ఆకస్మిక వరదల వల్ల 14 మంది మృతిచెందారు.
- By Gopichand Published Date - 01:31 PM, Sat - 18 March 23

గతనెల భూకంపంతో భారీ ప్రాణనష్టం చవిచూసిన టర్కీలో మరోసారి భూమి కంపించింది. గోక్సన్ జిల్లాలో సంభవించిన ఈ భూకంపం (Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. కాగా ఆ దేశంలోని సన్లీయుర్ఫా, అడియామన్ ప్రావిన్స్‌లో ఇటీవల ఆకస్మిక వరదల వల్ల 14 మంది మృతిచెందారు. భూకంప ఘటన తర్వాత కూడా ఆ దేశంలో వరుస విషాదాలు జరుగుతుండటం బాధాకరం. ఫిబ్రవరిలో జరిగిన భూకంప ఘటనలో 48వేల మందికిపైగా టర్కీ ప్రజలు చనిపోయారు.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం శనివారం గోక్సన్ జిల్లాకు నైరుతి దిశలో 6 కి.మీ దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 7 కిలోమీటర్ల లోతులో వరుసగా 37.974°N, 36.448°Eగా నమోదైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. టర్కీలోని మెడిటరేనియన్ ప్రాంతంలో గోక్సన్, కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లో భాగంగా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో సిరియాలో సంభవించిన భారీ భూకంపం నష్టాన్ని టర్కీ ఇప్పటికీ ఎదుర్కొంటోంది.
Also Read: Earthquake: న్యూజిలాండ్ లో మరోసారి భూకంపం
ఫిబ్రవరి 6 (ఉదయం 4.17 గంటలకు) దక్షిణ టర్కీలో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో విధ్వంసకర భూకంపం సంభవించింది. దాని కేంద్రం కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లోని పజార్సిక్ జిల్లాలో ఉంది. భూకంపం పొరుగు ప్రావిన్సులైన అడియామాన్, హటే, కహ్రామన్మరాస్, కిలిస్, ఉస్మానియే, గాజియాంటెప్, మలత్యా, సాన్లియుర్ఫా, దియార్‌బాకిర్, ఎలాజిగ్, అదానాలను ప్రభావితం చేసింది. ఇక్కడ సుమారు 1.8 మిలియన్ల మంది సిరియన్ శరణార్థులతో సహా 14 మిలియన్ల మంది నివసిస్తున్నారు.

Related News

Sperm Donor: స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎక్కడంటే..?
ఈ రోజు మనం చెప్పబోయే వ్యక్తి స్పెర్మ్ డొనేషన్ (Sperm Donor) ద్వారా 550 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు.