Earthquake: న్యూజిలాండ్ లో మరోసారి భూకంపం
న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవులలో శనివారం మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. మీడియా నివేదికల ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైంది.
- Author : Gopichand
Date : 18-03-2023 - 12:57 IST
Published By : Hashtagu Telugu Desk
న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవులలో శనివారం మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. మీడియా నివేదికల ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైంది. భూమి లోపల 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల ప్రాంతంలో శనివారం రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) నివేదించింది. కాగా.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి గురించి సమాచారం అందలేదు. గురువారం కూడా 7.1 తీవ్రతతో ఆ ప్రాంతంలో భూకంపం సంభవించింది.
Also Read: Nityananda Kailasa: అమెరికాలోని 30 సిటీలతో నిత్యానంద దేశం “కైలాస” అగ్రిమెంట్స్..?
గత నెలలో టర్కీ, సిరియాలో సంభవించిన వినాశకరమైన భూకంపంలో 60,000 మందికి పైగా మరణించారు. రెండు లక్షల మందికి పైగా గాయపడ్డారు. దీని కారణంగా 90 లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. 47 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంపం కారణంగా పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర వైద్య, ప్రసూతి, విద్యా సౌకర్యాలతో సహా అవసరమైన సేవలు ధ్వంసమయ్యాయి.