Russia and Ukraine Talks : భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహిస్తే శాంతిచర్చలకు రెడీ : పుతిన్
భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తే ఉక్రెయిన్‌తో(Russia and Ukraine Talks) శాంతిచర్చలకు తాను రెడీ అని పుతిన్ ప్రకటించారు.
- By Pasha Published Date - 03:13 PM, Thu - 5 September 24
Russia and Ukraine Talks : ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం వైపే ఉంది. ఇప్పటికే యుద్ధం మొదలై రెండున్నర ఏళ్లు పూర్తయ్యాయి. ఇంకా యుద్ధం కొనసాగుతుందా? త్వరలోనే వార్ ఆగిపోతుందా ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తే ఉక్రెయిన్‌తో(Russia and Ukraine Talks) శాంతిచర్చలకు తాను రెడీ అని పుతిన్ ప్రకటించారు.
Also Read :MLA Koneti Adimulam Suspended : ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణల పర్యవసానం
‘‘ఉక్రెయిన్ – రష్యా యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఇస్తాంబుల్ వేదికగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. అప్పట్లో శాంతి స్థాపనకు సంబంధించిన కొన్ని నిబంధనలను రెడీ చేసుకున్నాం. కానీ అవి అమలుకు నోచుకోలేదు. త్వరలో భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలను మొదలుపెట్టడానికి ఆనాడు ఇస్తాంబుల్ చర్చల్లో ప్రతిపాదించిన నిబంధనలను ప్రాతిపదికలుగా తీసుకోవచ్చు’’ అని పుతిన్ వెల్లడించారు. గురువారం ఈస్టెర్న్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సులో మాట్లాడుతూ పుతిన్ ఈ కీలక ప్రకటన చేశారు.
Also Read :Car Offers: హోండా కార్లపై కళ్ళు చెదిరే ఆఫర్స్.. ఏకంగా అన్ని లక్షల తగ్గింపు!
ఈసందర్భంగా అమెరికాపై పుతిన్ నిప్పులు చెరిగారు. ‘‘అమెరికా డాలర్‌ను దెబ్బతీయడానికి రష్యా ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు. అయితే అమెరికా డాలరులో చెల్లింపుల సెటిల్మెంట్లు చేయకుండా అనుసరించదగిన ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టాం. అమెరికా తీసుకునే నిర్ణయాలన్నీ తెలివితక్కువగానే ఉంటున్నాయి. బ్రిక్స్ గ్రూపులోని దేశాలు వాటివాటి జాతీయ కరెన్సీలను బలోపేతం చేసుకుంటే తప్పేంటి ? ’’ అని అమెరికాను పుతిన్ ప్రశ్నించారు. ‘‘ఉక్రెయిన్ బరితెగించి ప్రవర్తించింది. మా దేశంలోని కర్స్క్ ప్రాంతంలోకి చొరబడేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమైంది. ఉక్రెయిన్‌లోని డాన్ బాస్ ఏరియాలోకి రష్యా ఆర్మీ ప్రవేశించకుండా ఉక్రెయిన్ ఆపలేకపోయింది’’ అని పుతిన్ వెల్లడించారు.
Also Read :Double Ismart : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్..!
Related News
China Halts Foreign Adoptions : విదేశీయులకు పిల్లల దత్తతపై చైనా సంచలన నిర్ణయం
తమ దేశానికి చెందిన పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చే ప్రక్రియను(China Halts Foreign Adoptions) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.