Car Offers: హోండా కార్లపై కళ్ళు చెదిరే ఆఫర్స్.. ఏకంగా అన్ని లక్షల తగ్గింపు!
హోండా సంస్థ ప్రస్తుతం కొన్ని రకాల కార్లపై కళ్ళు చెదిరే డిస్కౌంట్ ని అందిస్తోంది.
- By Nakshatra Published Date - 12:30 PM, Thu - 5 September 24
పండుగల సీజన్ నెమ్మదిగా మొదలవుతోంది. మరో రెండు రోజుల్లో వినాయక చవితి పండుగ రానుంది. ఆ తర్వాత దసరా దీపావళి పండుగలు కూడా వెంట వెంటనే రానున్నాయి. ఇక పండుగ సీజన్ సమీపించడంతో వివిధ రకాల కంపెనీలు ఆఫ్ లైన్ అలాగే ఆన్లైన్ లలో ఫెస్టివల్ సేల్స్ ని నిర్వహిస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ ఈ ఆఫర్ల జాతర కొనసాగుతుంది. అలా ప్రస్తుతం వాహన రంగంలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. వినియోగదారులకు ఆకర్షించేందుకు అనేక వాహన తయారీదారులు భారీ తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తుంటారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ ఆఫర్ల జాతరను షురూ చేశాయి.
పండుగలకు వారం ముందుగానే హెూండా కార్ ఇండియా తమ ఉత్పత్తులపై అదిరే తగ్గింపు ధరలను అందిస్తోంది. హోండా అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి మోడళ్లతో పాటు మొత్తం ఉత్పత్తి పోర్ట్ ఫోలియోలోని అన్ని కార్లపై నగదు తగ్గింపులు, ఇతర ప్రయోజనాలను ప్రకటించింది. దాదాపు రూ. 114,000 వరకు తగ్గింపులు అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. జపనీస్ కార్ తయారీదారు అయిన హోండా పండుగల సీజన్‌ను అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం భారీగా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. అందులో భాగంగా హోండా సిటీ మిడ్ సైజ్ సెడాన్‌పై రూ. 1,14,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. హోండా సిటీ సెడాన్ అన్ని వేరియంట్లపైనా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
ఓఈఎం ఈ కారుతో ప్రామాణికంగా మూడేళ్ల ఉచిత నిర్వహణ ప్యాకేజీని అందిస్తోంది. అయితే, క్యాష్ డిస్కౌంట్ స్పెక్ట్రమ్ ఎంత అనేది వెల్లడించలేదు. ఐదో తరం హోండా సిటీ ధర రూ. 12,08,100 నుంచి ప్రారంభం అవుతుంది. హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ రూ.1,12,000 వరకు విలువైన ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. ఇందులో నగదు తగ్గింపుతో పాటు మూడు సంవత్సరాల ఉచిత నిర్వహణ ప్యాకేజీ ఉంటుంది. అంతేకాక అమేజ్ ప్రారంభ ధర ను కంపెనీ రూ. 30,000 తగ్గించింది. దీంతో ఈ సెడాన్ ఇప్పుడు రూ. 7,62,800 వద్ద అందుబాటులో ఉంది. ఈ వేరియంట్‌పై రూ. 82,000 వరకు ఎస్ వేరియంట్‌పై రూ. 92,000 వరకు ప్రయోజనాలను పొందుతుంది. హెూండా అమేజ్ వీఎక్స్, ఎలైట్ వేరియంట్ల అత్యధిక ప్రయోజనాలలు అందుబాటులో ఉన్నాయి.
అలాగే హోండా సిటీ ఈ:హెచ్‌ఈవీ మోడల్‌పై రూ. 90 వేల వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. ఇందులో మూడు సంవత్సరాల ఉచిత నిర్వహణ ప్యాకేజీ ఉంటుంది. ఈ హైబ్రిడ్ సెడాన్ ధర రూ. 20,55,100 నుంచి ప్రారంభమవుతుంది. హెూండా ఎలివేట్, భారతదేశంలో ఈ బ్రాండ్ నుంచి విక్రయించబడుతున్న ఏకైక ఎస్‌యూవీ. మూడు సంవత్సరాల పాటు ఉచిత నిర్వహణ ప్యాకేజీతో సహా రూ. 75,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. హోండా ఎలివేట్ ధర రూ.11.91 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ విధంగా పండుగ సీజన్ ఆఫర్లో భాగంగా కార్లపై ఏకంగా వేల నుంచి లక్షల్లో డిస్కౌంట్ ని పొందవచ్చు.
Related News
Ola Electric Scooters Discount: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై అదిరిపోయే డిస్కౌంట్.. ఈ ఆఫర్ అప్పటివరకు మాత్రమే!
వినాయక చవితి సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లపై బంపర్ ఆఫర్లను అందిస్తోంది.