Earthquake In Ecuador: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 13 మంది మృతి
ఈక్వెడార్ (Ecuador) తీరప్రాంతమైన గుయాస్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అక్కడి మీడియా నివేదించింది. ఈ భూకంపం కారణంగా 13 మంది మృతి చెందగా.. పలు భవనాలు, గృహాలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది.
- By Gopichand Published Date - 07:26 AM, Sun - 19 March 23

ఈక్వెడార్ (Ecuador) తీరప్రాంతమైన గుయాస్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అక్కడి మీడియా నివేదించింది. ఈ భూకంపం కారణంగా 13 మంది మృతి చెందగా.. పలు భవనాలు, గృహాలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ఈక్వెడార్‌లో శనివారం బలమైన భూకంపం సంభవించింది.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఈక్వెడార్ తీరప్రాంత గుయాస్ ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నివేదించింది. ఈక్వెడార్ దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన గుయాక్విల్ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు సమాచారం. అలాగే ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి.
#Earthquake Ecuador 🔴 Daños importantes se registran en #Cuenca pic.twitter.com/wp7AcBfozV
— 🅸🅽🅵🅾🆂🅸🆂🅼🅾🅻🅾🅶🅸🅲 (@EarthquakeChil1) March 18, 2023
భూకంప కేంద్రం ఈక్వెడార్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన గుయాక్విల్‌కు దక్షిణంగా 50 మైళ్ల (80 కిలోమీటర్లు) దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోషల్ మీడియాలో పంచుకున్న వీడియోలలో ప్రజలు గుయాక్విల్ వీధుల్లో గుమిగూడడం చూడవచ్చు. ఉత్తర పెరూలో కూడా ప్రకంపనలు సంభవించాయి. ఇక్కడ కూడా భూకంపం కారణంగా ఒకరు మృతి చెందారు.
అంతకుముందు, ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో మాట్లాడుతూ.. శక్తివంతమైన భూకంపం కారణంగా 13 మంది మరణించారు. భూకంపం కారణంగా దక్షిణ ఈక్వెడార్, ఉత్తర పెరూలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈక్వెడార్‌లో అత్యంత శక్తివంతమైన భూకంపం 2016లో సంభవించింది. ఇందులో వందలాది మంది చనిపోయారు. 1979 తర్వాత ఇది అత్యంత శక్తివంతమైన భూకంపం. ఈ సమయంలో వేలాది మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి.

Related News

Sperm Donor: స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎక్కడంటే..?
ఈ రోజు మనం చెప్పబోయే వ్యక్తి స్పెర్మ్ డొనేషన్ (Sperm Donor) ద్వారా 550 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు.