Indian National Anthem: పాక్ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్!
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
- By Gopichand Published Date - 05:03 PM, Sat - 22 February 25

Indian National Anthem: పాకిస్థాన్ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. శనివారం ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌కు ముందు పాక్ నిర్వాహకులు భారత జాతీయ గీతాన్ని (Indian National Anthem) ప్లే చేసి నవ్వులపాలైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ స్టేడియంలో భారత జాతీయ గీతాన్ని ప్లే చేయడం ఇదే మొదటి, చివరిసారి కావాలని అభిమానులు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతోంది. భారత్ తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరగనుంది.
లాహోర్‌లో భారత జాతీయ గీతం
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం జాతీయ గీతాలాపన కోసం ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. ఇంగ్లండ్ జాతీయ గీతం ముగిసిన తర్వాత, ఆస్ట్రేలియా జాతీయ గీతం ప్లే చేయవలసి ఉంది. కానీ ‘జన గణ మన’ (భారత జాతీయ గీతం) ప్లే చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీంతో స్టేడియంలో కూడా ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది.
Also Read: Bhatti Vikramarka : తెలంగాణలో వృద్ధి నేపథ్యంలో భద్రతా చర్యలు పటిష్టం
Pakistan by mistakenly played Indian National Anthem during England Vs Australia #ChampionsTrophy2025 pic.twitter.com/31D7hA6i6n
— hrishikesh (@hrishidev22) February 22, 2025
అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యమిచ్చేది పాకిస్థాన్ అయితే భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు దుబాయ్ రావాల్సి ఉంది. ఈ మ్యాచ్ (IND vs PAK) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 23 ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరుగుతుంది. భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో మాత్రమే ఆడనుంది. భారత్ ఫైనల్ చేరితే టైటిల్ మ్యాచ్ కూడా మార్చి 9న దుబాయ్ లోనే జరగనుంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య కీలక మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఇరు జట్లు దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌లతో గ్రూప్-బిలో ఉన్నాయి. ఈ గ్రూప్‌లోని తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి 2 పాయింట్లు సాధించింది. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈ గ్రూప్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలుస్తుంది.