HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Inspects The Pashamilaram Accident Site

Pashamylaram : పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి ఉన్న ఉన్నతాధికారులతో సీఎం తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ బృందాలకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం, సీఎం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకోనున్నారు.

  • Author : Latha Suma Date : 01-07-2025 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy inspects the Pashamilaram accident site
CM Revanth Reddy inspects the Pashamilaram accident site

Pashamylaram : సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం వద్ద జరిగిన ఘోర రసాయన పేలుడు ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. సిగాచీ ఇండస్ట్రీస్‌ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం సంభవించిన ఈ భారీ పేలుడులో ఇప్పటి వరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు  వివేక్, దుదిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజనర్సింహలు కూడా ఉన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి ఉన్న ఉన్నతాధికారులతో సీఎం తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ బృందాలకు ఆయన ధైర్యం చెప్పారు.

Read Also: Ponguleti : దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం, సీఎం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇది ఒక విషాదకరమైన సంఘటన. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుంది. సహాయక చర్యలు పూర్తయ్యాక బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారు. సోమవారం రాత్రి వరకు మృతుల సంఖ్య 12గా ఉండగా, మంగళవారం ఉదయానికి అది 34కి చేరింది. శిథిలాల నుంచి మరిన్ని మృతదేహాలు బయటపడడంతో మృతుల సంఖ్య 42కి పెరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ..”శిథిలాల తొలగింపు చివరి దశలో ఉంది. మరోసారి పరిశీలన తర్వాత సహాయక చర్యలు ముగుస్తాయి. బాధితుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది అన్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు సంఘటనపై స్పందించారు. పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రమాద ఘటన బాధితులకు సత్వరంగా న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ప్రకటన మేరకు, మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించనున్నట్టు సమాచారం.

Read Also: Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలుకు అంతర్జాతీయ పురస్కారం, ప్రత్యేక గుర్తింపు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • factory explosion
  • Pasamylaram Explosion
  • Pashamylaram
  • pashamylaram accident site
  • Sigaachi Chemicals

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd