CM Chandrababu : పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేక నష్టపోయిన ప్రజలకు మేం భరోసా ఇస్తున్నాం. పేదల కోసం ‘పేదల సేవలో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒక్క నెలకే పింఛన్ల ఖర్చుగా రూ.2,750 కోట్లు వెచ్చిస్తున్నాం.అని వివరించారు.
- By Latha Suma Published Date - 03:48 PM, Tue - 1 July 25

CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పింఛన్లు గ్రామ జీవనానికి ప్రాణవాయువు లాంటివని వ్యాఖ్యానించారు. ప్రతినెలా ఒకటో తేదీని గ్రామాల్లో ఉత్సవంగా మార్చే శక్తి పింఛన్లలో ఉందని అన్నారు. పింఛన్ల వల్ల గ్రామాలు వెలుగు చూస్తున్నాయని, పేదల జీవితం లో వెలుగు రాగం పాడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేక నష్టపోయిన ప్రజలకు మేం భరోసా ఇస్తున్నాం. పేదల కోసం ‘పేదల సేవలో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒక్క నెలకే పింఛన్ల ఖర్చుగా రూ.2,750 కోట్లు వెచ్చిస్తున్నాం.అని వివరించారు.
Read Also: Pregnant lady : పుట్టబోయే బిడ్డ కోసం గర్బిణీలు మహిళలు తప్పక చేయించాల్సిన స్కానింగ్స్ ఏంటంటే?
ఆయన పేర్కొన్న సూపర్‌సిక్స్ పథకాల అమలు పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వీటిలో తల్లికి వందనం, విద్యార్థుల కోసం విద్యా సహాయాలు, రైతు భరోసా, మహిళల రక్షణ, యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించామన్నారు. వేదికపై సీఎం డప్పు కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది పింఛన్ల పంపిణీకి సంబర శుభాకాంక్షల గుర్తుగా భాసిల్లింది. గత ప్రభుత్వ హయాంలో పరిపాలన వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ దిగజారింది. ఇప్పుడు మేము వికాస పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇది తొలి అడుగు అని సీఎం వ్యాఖ్యానించారు.
ఆగస్టు 15 నుండి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందించనున్నట్టు ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే రూ.10వేల కోట్లు ఖర్చు చేశాం. మాతృశక్తికి మా ప్రభుత్వం అంకితం అన్నారు. విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమాన్ని గుర్తుచేస్తూ ఈ యోగ ఉత్సవం ద్వారా రెండు గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు సాధించాం. ఇది తెలుగువారి గర్వకారణం అని పేర్కొన్నారు. చివరగా, సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ మేము సంపద సృష్టిస్తాం. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతాం. ప్రతి పేద మన గుండెల్లో ఉంటాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెడతాం అని హామీ ఇచ్చారు.
Read Also: BJP: తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు బాధ్యతలు