HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Wife Of Retired Ips Officer Murdered In Jubilee Hills

Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • Author : Vamsi Chowdary Korata Date : 08-05-2026 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Retired IPS Officer Wife Incident in Jubilee Hills
Retired IPS Officer Wife Incident in Jubilee Hills

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. బంగారం, డబ్బుల కోసం పనిమనిషి కల్పన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్‌తో కల్పన, ఆమె గ్యాంగ్ ఏడెనిమిది నెలల పాటు ఎదురుచూసినట్లు తెలుస్తోంది.

ఇంటి ముందు నుంచి వస్తే సీసీటీవీ ఫుటేజీకి చిక్కుతామని భావించి, వెనుక నుంచి వచ్చి ఈ హత్యకు పాల్పడ్డారు. కల్పనతో సహా మొత్తం ముగ్గురు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య తర్వాత పారిపోయే క్రమంలో ఒక నిందితుడి క్యాప్ కింద పడటంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. సునంద భర్త వినయ్ రంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు.

సునంద ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన కల్పన, ఈ విషయాన్ని తన గ్యాంగుకు చేరవేసి వారిని రప్పించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ హత్య జరిగింది. కల్పన నేపాల్‌కు చెందిన మహిళ. డబ్బులు, బంగారం చోరీ కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. రాత్రి రెండు గంటల సమయంలో హత్య జరిగిందని తెలిపారు. నేపాలీ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని అన్నారు. కొన్ని ఆధారాలు సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని సజ్జనార్ అన్నారు. నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేశారని వెల్లడించారు. బంగారం, నగలు ఎత్తుకుపోయారా లేదా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. వెనుక గేటు నుంచి వచ్చి హత్య చేసినట్లు చెప్పారు. కాగా, డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime news
  • CV Anand
  • hyderabad
  • ips officer
  • jubilee hills
  • murder
  • Prashasan Nagar
  • Sajjanar

Related News

Do not stop traffic for the CM or VIP convoy

Revanth Reddy: CM, VIP కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన కాన్వాయ్ కోసం రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. తన ఢిల్లీ టూర్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ గురించి సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే స్పెషల్‌గా ట్రాఫిక్ బ్యూరోను ఏర్పాటు చేయన

  • Crime

    కోదాడ బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై వెంటాడి.. భార్యను చంపిన భర్త

  • Phone Recharge suicide Live-in relationship Jeedimetla hyderabad

    Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..

  • Telangana Government Announces 2BHK Homes for HYDRA Victims

    HYDRA: హైడ్రా బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

  • CM Chandrababu Naidu to Visit Pawan Kalyans Residence

    పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

Latest News

  • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

  • Hantavirus: హంటా వైరస్ లక్షణాలు ఏంటి? కరోనా కంటే ప్రమాదమా?

  • Tamil Nadu politics: దళపతి విజయ్‌కు భారీ షాక్..

  • Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

  • TVK విజయ్ ఆసక్తికర ట్వీట్

Trending News

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd