HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Husband Chases Wife On Main Road Near Kodad Bus Stand And Kills Her

కోదాడ బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై వెంటాడి.. భార్యను చంపిన భర్త

  • Author : Vamsi Chowdary Korata Date : 07-05-2026 - 8:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బుధవారం రాత్రి కోదాడ బస్టాండ్ వద్ద ఈ ఘోరం జరిగింది. పోలీసులతో కౌన్సెలింగ్ తీసుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఈ దారుణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోదాడలోని బాబునగర్‌కు చెందిన మణిదీప్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శిరీష (24)ను ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన గొడవతో బుధవారం శిరీష, ఆమె పెద్దమ్మ, మణిదీప్ కోదాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించారు.

అయితే, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఈ ఘోరం జరిగింది. జగ్గయ్యపేట వెళ్లేందుకు పెద్దమ్మతో కలిసి శిరీష ఆటో ఎక్కగా, మణిదీప్ ఆమెను బలవంతంగా బయటకు లాగాడు. ప్రాణభయంతో ఆమె సమీపంలోని టీ స్టాల్‌లోకి పరుగెత్తగా కత్తితో వెంటాడి విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శిరీషను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ దాడి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడు మణిదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime news
  • kodada
  • suryapet

Related News

Bus Accident

Road Accident : కోదాడ స‌మీపంలో లారీని ఢీకొట్టిన ప్ర‌వేట్ ట్రావెల్స్ బ‌స్సు

ప్ర‌వేట్ ట్రావెల్స్ బ‌స్సులు వ‌రుస రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో అగ్నిప్ర‌మాదాల‌కు గురైన బ‌స్సులు తాజాగా రోడ్డు ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, కోదాడ్ పట్టణం సమీపంలో జాతీయ రహదారి 65పై ప్ర‌వేట్ ట్రావెల్స్ బ‌స్సు లారీని ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెను

  • 10-Year-Old Girl Kidnapped and Murdered in Coimbatore... CM Vijay Shares Emotional Post!

    Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd