HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Second Meeting On Re Division To Be Held In Hyderabad Next Month

Re-Division Second Meeting: వ‌చ్చే నెల‌లో హైద‌రాబాద్‌లో పున‌ర్విభ‌జ‌న‌పై రెండో స‌ద‌స్సు!

ఇందుకు స‌ద‌స్సులో పాల్గొన్న‌వారంతా మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పున‌ర్విభ‌జ‌న సద‌స్సు, స‌భ‌కు హైద‌రాబాద్ వేదిక‌గా మార‌నుంది.

  • Author : Gopi Date : 22-03-2025 - 4:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Re-Division Second Meeting
Re-Division Second Meeting
  • పునర్విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయే రాష్ట్రాల హ‌క్కుల ర‌క్ష‌ణ‌కు భారీ బ‌హిరంగ స‌భ‌
  • జాతీయ స్థాయిలో స‌మ‌న్వ‌యం..కార్యాచ‌ర‌ణ అమ‌లుకు ఢిల్లీలో కార్యాల‌యం
  • ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల‌కు స‌దస్సులో ఆమోదం

Re-Division Second Meeting: నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు (Re-Division Second Meeting) సంబంధించి ద‌క్షిణాది రాష్ట్రాలతో పాటు న‌ష్ట‌పోయే ఇత‌ర రాష్ట్రాల హ‌క్కుల‌ను కాపాడుకునే క్ర‌మంలో రెండో స‌ద‌స్సుకు హైద‌రాబాద్‌లో వేదిక‌కానుంది. పున‌ర్విభ‌జ‌న‌కు సంబంధించి చెన్నైలో శ‌నివారం నిర్వ‌హించిన స‌ద‌స్సు ఈ మేర‌కు తీర్మానించింది. స‌దస్సులో ప్ర‌సంగించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పున‌ర్విభ‌జ‌న‌తో నష్ట‌పోనున్న రాష్ట్రాల ప్ర‌జ‌ల అభిమ‌తానికి అనుగుణంగా రెండో స‌ద‌స్సును హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తామ‌ని, అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.

ఇందుకు స‌ద‌స్సులో పాల్గొన్న‌వారంతా మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పున‌ర్విభ‌జ‌న సద‌స్సు, స‌భ‌కు హైద‌రాబాద్ వేదిక‌గా మార‌నుంది. పున‌ర్విభ‌జ‌న‌పై ద‌క్షిణాదితో పాటు న‌ష్ట‌పోయే ఇత‌ర రాష్ట్రాల గ‌ళాన్ని బ‌లంగా వినిపించేందుకు ఆయా రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ఎంపీల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే అన్ని రాజ‌కీయ ప‌ర‌మైన నిర్ణ‌యాలు జ‌రుగుతాయ‌ని, ఈ నేప‌థ్యంలో అక్క‌డ కార్య‌క‌లాపాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ.. ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ రూప‌క‌ల్ప‌న‌కు ఎంపీల‌తో కూడిన క‌మిటీ ప‌ని చేయాల‌ని, ఇందుకు ప్ర‌త్యేక కార్యాల‌యం ఏర్పాటు చేయాల‌ని స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు స‌ద‌స్సులో పాల్గొన్న ముఖ్య‌మంత్రులు, నాయ‌కులు అంగీక‌రించ‌డంతో ఢిల్లీలో ఆ కార్యాల‌యం ఏర్పాటుకు రంగం సిద్ధ‌మైంది.

Also Read: Gold Prices: అల‌ర్ట్‌.. ఏప్రిల్ 2 నుండి పెర‌గ‌నున్న బంగారం ధ‌ర‌లు..!

స‌ద‌స్సులో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా రేవంత్ రెడ్డి

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు సంబంధించి చ‌రిత్ర‌.. వ‌ర్త‌మాన ప‌రిస్థితుల‌తో పాటు జనాభా దామాషా, ప్రొరేట్ ప్ర‌కారం పున‌ర్విభ‌జ‌న జ‌రిపితే ద‌క్షిణాది రాష్ట్రాలు, పంజాబ్‌, ఒడిశా న‌ష్ట‌పోయే తీరును సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించ‌డంతో స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రూ శ్ర‌ద్ద‌గా విన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టినా లోక్‌స‌భ సీట్లు పెంచ‌కుండా శాస‌న‌స‌భ సీట్లు పెంచుకునే అవ‌కాశం రాష్ట్రాలకు క‌ల్పించాల‌ని సీఎం సూచించ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ర్షించింది. మ‌హిళల‌కు 33శాతం సీట్లు, ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపుపైనా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచ‌న‌లు చాలా అర్ధ‌వంతంగా ఉన్నాయ‌ని స‌ద‌స్సులో పాల్గొన్న వివిధ పార్టీల నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai
  • cm revanth
  • Delimitation
  • hyderabad
  • Re-Division
  • Re-Division Second Meeting
  • telangana

Related News

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  • employer's daughter into stealing 100 tola gold

    ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

Latest News

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

Trending News

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd