HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >An Elephant Calf Born To A Pig Here Is The Real Truth

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Author : Vamsi Chowdary Korata Date : 20-04-2026 - 11:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pig Gives Birth To Elephant
Pig Gives Birth To Elephant

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే… కార్పాముల గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య పందులను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పెంచుతున్న ఓ పంది ఇటీవల మొదటి ఈతలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిని పరిశీలించిన వెంకటయ్యకు ఓ విచిత్రమైన దృశ్యం కంటపడింది. ఆ ఏడు పిల్లల్లో ఒకటి మిగతావాటికి భిన్నంగా ఏనుగు ఆకారంలో ఉండటంతో ఆయన నివ్వెరపోయాడు. ఆ పందిపిల్లకు ముఖభాగంలో తొండం, తలకు ఇరువైపులా పెద్ద చెవులు ఉన్నాయి.

ఈ వింత విషయం ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. దీంతో ఆ ఏనుగు రూపంలోని పందిపిల్లను చూసేందుకు ప్రజలు వెంకటయ్య ఇంటికి పెద్దఎత్తున తరలివచ్చారు. కొందరు దీనిని ప్రకృతి విచిత్రంగా అభివర్ణిస్తుంటే, మరికొందరు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో చెప్పినట్లు కలియుగంలో ఇలాంటి వింతలు సహజమేనని చర్చించుకుంటున్నారు.

అయితే దురదృష్టవశాత్తూ, ఆ వింత పందిపిల్లతో పాటు మరో పిల్ల పుట్టిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాయి. ప్రస్తుతం మిగిలిన ఐదు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని యజమాని వెంకటయ్య తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన పశువైద్య నిపుణులు, ఇది దైవ మహత్యమో, వింత శక్తో కాదని స్పష్టం చేశారు. గర్భంలో పిండం ఎదుగుదల సరిగా లేనప్పుడు లేదా జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి శారీరక మార్పులు సంభవిస్తాయని వివరించారు. దీనిని వైద్య పరిభాషలో ‘కంజెనిటల్ అబ్నార్మాలిటీ’ (పుట్టుకతో వచ్చే వైకల్యం) అంటారని, ఇలాంటి వింత ఆకారాలతో పుట్టిన జీవులు ఎక్కువ కాలం బతకడం అరుదని వారు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Karpaamula Village
  • Kuraakula Venkataiah
  • Nagarkurnool
  • Pig gives birth to elephant baby
  • telangana
  • Veterinary doctor

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd