HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Post Election Fuel Shock Petrol And Diesel Prices May Surge

ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

ప్ర‌త్య‌క్షంగా చూసుకుంటే ఒకవేళ లీటరుకు రూ. 25 పెరిగితే, 15 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం గల బైక్‌ను ఫుల్ చేయించుకోవడానికి అదనంగా రూ. 375 చెల్లించాల్సి ఉంటుంది.

  • Author : Gopi Date : 23-04-2026 - 3:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Petrol- Diesel Prices
Petrol- Diesel Prices

Petrol- Diesel Prices: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఈ భారాన్ని దేశీయ చమురు సంస్థలు భరిస్తున్నప్పటికీ ఎన్నికల తర్వాత ఆ భారం వినియోగదారులపై పడే అవకాశం ఉందని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది.

పెట్రోల్-డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతాయి?

హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనివల్ల ముడిచమురు ధరలు వేగంగా పెరిగాయి. ఫిబ్రవరి 27న బ్యారెల్ ధర 72 డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 103 డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు సామాన్యుల కోసం ధరలను పెంచలేదు. దీనివల్ల చమురు సంస్థలు కొనుగోలు చేసే ధరకు, కస్టమర్లకు అమ్మే ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. గతంలో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని రూ. 10 తగ్గించినప్పటికీ చమురు సంస్థలకు నెలకు సుమారు రూ. 27 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది.

Also Read: Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

సామాన్యుడి జేబుపై ప్రభావం ఎలా ఉంటుంది?

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యుడిపై పడుతుంది. ప్ర‌త్య‌క్షంగా చూసుకుంటే ఒకవేళ లీటరుకు రూ. 25 పెరిగితే, 15 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం గల బైక్‌ను ఫుల్ చేయించుకోవడానికి అదనంగా రూ. 375 చెల్లించాల్సి ఉంటుంది. స్కూటీ ట్యాంక్ కోసం రూ. 100 కంటే ఎక్కువ ఖర్చు చేయాలి. ఆటో, బస్సు, క్యాబ్ చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. పరోక్షంగా డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంటే పాలు, కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crude oil
  • fuel price hike
  • Kotak Institutional Equities
  • Petrol Diesel Prices
  • Petrol Diesel Rate Increase
  • Post-Election Inflation
  • Strait of Hormuz Blockade

Related News

Iran Slams Trump

ట్రంప్‌కు షాక్ ఇచ్చిన ఇరాన్‌!

ఇరాన్ తన వద్ద ఉన్న 440 కిలోల సుసంపన్నమైన యురేనియంను అప్పగించడానికి అంగీకరించిందని ట్రంప్ క్లెయిమ్ చేశారు.

    Latest News

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd