HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Wealthy Minor Girls Are Their Target

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • Author : Vamsi Chowdary Korata Date : 20-04-2026 - 11:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Minor Girl instagram Trap Case
Hyderabad Minor Girl instagram Trap Case

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలింది. ఇన్‌స్టా వేదికగా డబ్బున్న అమ్మాయిలతో పరిచయం పెంచుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలే లక్ష్యంగా వల విసిరి, ప్రేమ పేరుతో వారిని వంచించి లక్షలాది రూపాయలు కాజేస్తున్న ఒక ఘరానా మోసగాడిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (23), సోషల్ మీడియా వేదికగా గత రెండేళ్లలో దాదాపు 20 మందికి పైగా బాలికలను నమ్మించి మోసగించినట్లు విచారణలో వెల్లడైంది.

ప్రస్తుతం మియాపూర్‌లో నివసిస్తున్న ఆజాద్, జూబ్లీహిల్స్ వంటి సంపన్న ప్రాంతాల్లోని ఇళ్లపై నిఘా పెట్టేవాడు. అక్కడి వాచ్‌మెన్లు, తోటమాలితో పరిచయం పెంచుకుని ఆ ఇళ్లలోని మైనర్ బాలికలు, యువతుల వివరాలు సేకరించేవాడు. ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో తాను ఖరీదైన కార్లు, పబ్బుల్లో దిగిన ఫోటోలను పంపి తనకు తాను పెద్ద ధనవంతుడినని నమ్మించేవాడు. వారిని ప్రేమలోకి దించి ఆ తర్వాత ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు.

ఇటీవల జూబ్లీహిల్స్‌లో నివసించే ఓ 15 ఏళ్ల బాలికను అర్జున్ అనే మారు పేరుతో పరిచయం చేసుకున్న ఆజాద్, ఆమెను లోబరుచుకున్నాడు. గతంలోనే ఇతనిపై పోక్సో కేసు నమోదైనా జైలు నుంచి వచ్చాక మళ్లీ అదే బాలికను వేధించడం మొదలుపెట్టాడు. నిందితుడి బెదిరింపులకు భయపడి ఆ బాలిక తన ఇంట్లో ఉన్న రూ. 29 లక్షల నగదును చోరీ చేసింది. ఇందులో ఆజాద్‌కు రూ. 13 లక్షలు ఇవ్వగా, ఈ విషయం తెలిసి బ్లాక్‌మెయిల్ చేసిన ఆ ఇంటి కారు డ్రైవర్ భార్యకు రూ. 10 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

కేవలం మైనర్లనే కాకుండా నార్సింగి ప్రాంతానికి చెందిన ఓ యువతిని కూడా ఆజాద్ వంచించాడు. గుంటూరులో కాలేజీలో చేర్పించే నెపంతో ఆమెను హోటల్ గదికి తీసుకెళ్లి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత వారు ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలు చూపిస్తూ బెదిరించి ఆమె నుంచి బంగారు గొలుసును కాజేశాడు. బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆజాద్‌ను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. వారి ప్రవర్తనలో ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే ఆరా తీయాలని చెబుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి చాలా మంది కేటుగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • instagram
  • minor girls
  • social media
  • Trap Case

Related News

A Deliberate Conspiracy Against Us... Paying for Malicious Propaganda on Social Media —

Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియాలో దుష్ప్రచారం Nandu’ s world సంచలనం

Nandu’s World Nandana నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన భార్యాభర్తలపై కొద్దిరోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. యూకే వీసా పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఈ జంట టార్గెట్‌గా పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలపై నందూస్ వరల్డ్ నందన స్పందించారు.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ‘నందూస్ వరల్డ్’ (Nandus World) పేరుతో యూకేలో ఉంటున్న భ

  • Death

    Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

Latest News

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd