HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Greater Hyderabad As Three Corporations

మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్

  • Author : Vamsi Chowdary Korata Date : 30-12-2025 - 2:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Musi River
Musi River

Musi River : హైదరాబాద్ మహానగర పాలనలో భారీ మార్పులు రానున్నాయి. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, పాలనా సౌలభ్యం కోసం నగరాన్ని మూడు భాగాలుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదిని ఆధారంగా చేసుకుని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ పేర్లతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ విభజనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి జనవరి నెలలో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారని సమాచారం.

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • మూసి చుట్టూ 3 కార్పొరేషన్లుగా హైదరాబాద్ విభజన
  • జనవరి నెలలో తుది నోటిఫికేషన్

హైదరాబాద్ మహానగర పాలనలో భారీ మార్పులు సంభవించబోతున్నాయి. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అలానే పాలనా సౌలభ్యం కోసం నగరాన్ని విభజించేందుకు సిద్ధం అయ్యింది. ఈక్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నదిని ఆధారంగా చేసుకుని.. మహా నగరాన్ని మూడు భాగాలుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

హైదరాబాద్ నగరం మధ్య నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. ఈక్రమంలో నదిని ఆధారంగా చేసుకుని.. మహా నగరాన్ని మూడు భాగాలుగా విభజించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ పేర్లతో మొత్తం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ మహా నగర కార్పొరేషన్‌ డ్రైనేజ్‌ వ్యవస్థకు మూసీ నదే కీలకం. కనుక.. మూసీకి ఇరువైపుల ప్రాంతాలు వచ్చేలా.. ఈ మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

ఒక్కో కార్పొరేషన్‌ పరిధిలో 5 జోన్లు, 20 సర్కిళ్లు, 100 వార్డులు ఉంటాయి. అలానే ప్రతి జోన్‌కు 4 సర్కిళ్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 3 కార్పొరేషన్లకు ముగ్గురు మేయర్లు ఉంటారు. ప్రతి కార్పొరేషన్‌కు.. ఒక కార్యదర్శి స్థాయి అధికారి.. కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి.. వచ్చే సంవత్సరం జనవరిలో.. తుది నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోకి పాతనగరంతో పాటు సెంట్రల్ హైదరాబాద్ భాగంగా ఉండనుంది. అలానే గ్రేటర్ సైబరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ పరిధిలో.. హైదరాబాద్ పశ్చిమ, వాయవ్య ప్రాంతాలు కలుస్తాయి. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GSMC) పరిధిలోకి ఉత్తర, ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలు వస్తాయి.

ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి చాలా విస్తారంగా ఉంది. దీంతో నగర ప్రజలకు సేవలు అందించడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న కోర్ సిటీని ఒక కార్పొరేషన్‌గా ఉంచి, శివారు ప్రాంతాలను కలుపుతూ మరో రెండు కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే మూసీ చుట్టూ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Expansion Plan
  • GHMC
  • hyderabad
  • Musi river
  • telangana government
  • Three Corporations

Related News

A New Look for the Kaleswaram Temple

Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశే

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

    Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

Latest News

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd