HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >A New Look For The Kaleswaram Temple

Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

  • Author : Vamsi Chowdary Korata Date : 17-06-2026 - 11:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
A New Look for the Kaleswaram Temple
A New Look for the Kaleswaram Temple

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశేఖర భారతీతీర్థ స్వామి అనుమతి, శాస్త్రోక్త సూచనలతో ఈ ఆలయ పునర్నిర్మాణాలకు తుది రూపకల్పన చేశామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నేడు ఆలయ ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు పూజలను అర్చక బృందం అత్యంత శాస్త్రోక్తంగా ప్రారంభించింది.

ఆలయ పునర్నిర్మాణాలపై మంగళవారం (జూన్ 16) కాళేశ్వరం ఈవో కార్యాలయంలో ఒక ఉన్నతస్థాయి ప్రత్యేక సమావేశం జరిగింది. ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ అర్చకులు, స్థానిక ప్రముఖులు మరియు పాలకవర్గ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కాళేశ్వర క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలోనే అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడారు. క్షేత్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ. 198 కోట్ల భారీ నిధులను మంజూరు చేయగా.. పురాణ ప్రాశస్త్యం కలిగిన పూర్వపు అష్టతీర్థాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం అదనంగా మరో రూ. 60 కోట్లను కేటాయించారు. తద్వారా మొత్తం రూ. 258 కోట్లతో ఈ పనులు జరగనున్నాయని వివరించారు.

కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం.. కాళేశ్వర క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న సిమెంట్ కట్టడాల స్థానంలో కాకతీయ, ద్రవిడ శిల్పకళ ఉట్టిపడేలా సంప్రదాయ రాతి కట్టడాల నిర్మాణాలను చేపట్టనున్నారు. దీనివల్ల ఆలయ ఆవరణం అత్యంత విశాలంగా మారడమే కాకుండా.. రాబోయే వందల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా నిలిచిపోతుంది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఒకే సమయంలో ఆలయ ఆవరణలో దాదాపు 25 వేల మంది భక్తులు వేచి ఉండేలా విశాలమైన మండపాలు, క్యూలైన్లు మరియు వసతి సౌకర్యాలను నిర్మిస్తున్నారు.

సమయపాలన విషయంలోనూ దేవాదాయశాఖ అత్యంత కచ్చితంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాల వేళకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరానికి తరలివచ్చే అవకాశం ఉంది. అందువల్ల, పుష్కరాలు ప్రారంభం కావడానికి ఒక నెల ముందుగానే.. అంటే మే 2027 నాటికే ఈ పునర్నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడువు విధించారని, ఆ మేరకు పనులను శరవేగంగా పూర్తి చేస్తామని కమిషనర్ హనుమంతరావు చెప్పారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanthreddy
  • congress party
  • Kaleshwaram Temple
  • Renovation
  • telangana government

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd