Errabelli Dayakar Rao: నేను కేసీఆర్ సైనికుడిని, పార్టీ మారే ముచ్చటే లేదు
బీఆర్ఎస్ పార్టీని వీడి దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి వంటి కీలక నేతలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఎర్రబెల్లి బీజేపీలో చేరబోతున్నారనే చర్చ సాగుతోంది.
- Author : Praveen Aluthuru
Date : 19-03-2024 - 5:24 IST
Published By : Hashtagu Telugu Desk
Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ పార్టీని వీడి దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి వంటి కీలక నేతలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఎర్రబెల్లి బీజేపీలో చేరబోతున్నారనే చర్చ సాగుతోంది. ఈ వార్తలపై ఎర్రబెల్లి స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తమ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి సైనికుడిలా కృషి చేస్తానని ఎర్రబెల్లి అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. భూకబ్జాలు, వ్యాపారాలు, తప్పుడు పనులు చేసే నాయకులు పార్టీలు మారతారన్నారు.
మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్‌పై ఎర్రబెల్లి స్పందిస్తూ.. అతనెవరో కూడా తనకు తెలియదన్నారు.కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలను అమలు చేయలేదన్నారు. మోసం చేయడం, మాయమాటలు చెప్పడం రేవంత్‌కు అలవాటని అన్నారు ఎర్రబెల్లి దయాకర్‌రావు.
Also Read: AP Politics : కేవలం అక్కడి కాపులకే పవన్ కళ్యాణ్ కేర్ ఆఫ్ అడ్రస్సా..?