HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >25 Thousand Bogus Employees In Telangana Cm Revanths Key Orders

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 04-03-2026 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.
We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

Revanth Reddy  రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ చేయించి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన తీవ్రంగా ఆదేశించారు. కలెక్టర్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని అమలు చేయడంపై ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల భాగస్వామ్యంతో ఈ ప్రణాళికను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఈ నెల‌ 12న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం సేకరణలో మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, వారి నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టాల్సిన పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కలెక్టర్లు, ఎస్పీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, దానికి సంబంధించిన కార్యక్రమాలను ఒక వేడుక వాతావరణంలో జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bogus Employees
  • Chief Minister Revanth Reddy
  • CM Revanth Reddy
  • District Collectors meeting
  • employees
  • fake employees
  • Government Funds Misuse
  • Grain Procurement
  • illegal mining
  • Illegal Mining Mafia
  • Outsourcing Agencies
  • Prajapalana Pragathi Plan
  • sand mafia
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd