Deputy CM Bhatti: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి..!
తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) దర్శించుకున్నారు.
- By Gopichand Published Date - 01:20 PM, Tue - 12 December 23

Deputy CM Bhatti: తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్న భట్టికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో భట్టి విక్రమార్క కుటుంబానికి పండితులు వేదాశీర్వచనం అందజేయగా, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను, 2024 టీటీడీ డైరీ, క్యాలండర్ ను అందజేశారు.
Also Read: Nani : స్టార్స్ ని వెనక్కి నెట్టి సత్తా చాటుతున్న నాని..!
అనంతరం ఆలయం వెలుపల భట్టి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన అధ్భుతమైన తీర్పును ఇచ్చారని, తాను నిర్వర్తించే ఆర్థిక శాఖలో ఆర్థిక వనరులు అభివృద్ది చెందేలా కృషి చేస్తానని, పార్టీ పరంగా ఆరు గ్యారంటీలను నేరవేస్తామని డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.