Nani : స్టార్స్ ని వెనక్కి నెట్టి సత్తా చాటుతున్న నాని..!
న్యాచురల్ స్టార్ నాని (Nani) ఖాతాలో హాయ్ నాన్న మరో హిట్ దక్కేలా చేసింది. కొత్త దర్శకులతో నాని చేస్తున్న ప్రయత్నాలు సూపర్ సక్సెస్
- By Ramesh Published Date - 01:04 PM, Tue - 12 December 23
న్యాచురల్ స్టార్ నాని (Nani) ఖాతాలో హాయ్ నాన్న మరో హిట్ దక్కేలా చేసింది. కొత్త దర్శకులతో నాని చేస్తున్న ప్రయత్నాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. కథ మీద నమ్మకంతో నాని చేస్తున్న ఈ ప్రయోగాలు అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఈ ఇయర్ ఆల్రెడీ దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ఇయర్ ఎండింగ్ లో హాయ్ నాన్న అంటూ ఒక మెమరబుల్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలతో ఇద్దరు ప్రతిభ గల దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాని.
ఇక ఇదిలాఉంటే నాని అమెరికా లో మరో రికార్డ్ కూడా అందుకున్నాడు. ఓవర్సీస్ లో టాలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ ఒక్కడే 11 సార్లు మిలియన్ మార్క్ కలెక్షన్స్ సాధించాడు. మహేష్ తర్వాత నాని 9 సార్లు మిలియన్ మార్క్ కలెక్షన్స్ సాధించాడు. రీసెంట్ గా రిలీజైన హాయ్ నాన్న సినిమాతో నాని మరోసారి ఆ ఫీట్ సాధించాడు.
Also Read : Jr Ntr: ఎన్టీఆర్ పై వార్2 ఎఫెక్ట్.. స్పీడ్ తగ్గిన ‘దేవర’ షూటింగ్
నాని నటించిన భలే భలే మగాడివోయ్ మారుతి డైరెక్షన్ లో తెరకెక్కగా అది మొదటి 1 మిలియన్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది ఆ తర్వాత నేను లోకల్, నిన్ను కోరి, ఎం.సి.ఏ, జెర్సీ, మన దగ్గర అంతగా కమర్షియల్ సక్సెస్ అవ్వని అంటే సుందరానికి కూడా యూఎస్ లో 1 మిలియన్ రాబట్టింది. ఇక ఈ ఇయర్ వచ్చిన దసరా ఇప్పుడు హాయ్ నాన్న ఇలా 9 సినిమాలతో టాలీవుడ్ హీరోల్లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు నాని.
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి న్యాచురల్ స్టార్ గా తన సత్తా చాటుతున్న నాని కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. తప్పకుండా నాని ఇలాంటి రికార్డులు మరెన్నో చేస్తాడని ఆయన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఆశిస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
Related News
Nani : నాని, సుజిత్ సినిమా ఆగిపోలేదట.. మరో నిర్మాత చేతిలోకి..
నాని, సుజిత్ సినిమా ఆగిపోలేదట. డివివి నుంచి మరో నిర్మాత చేతిలోకి..