HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Clean Chit In Delhi Liquor Case New Party Formed After Tirumala Visit

ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్.. తిరుమల పర్యటన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు : కల్వకుంట్ల కవిత

  • Author : Vamsi Chowdary Korata Date : 03-03-2026 - 3:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha  ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే నేరుగా కొండపైకి వెళ్లకుండా.. మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయింది. మరోవైపు.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన కవిత.. ఈ తిరుమల పర్యటన తర్వాత తన కార్యాచరణను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో.. ఇటీవల కీలక తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది భారీ ఊరట కల్పిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో సీబీఐ అధికారులు సరైన ఆధారాలు సమర్పించలేదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. దీంతో నిందితులందరికీ బిగ్ రిలీఫ్ లభించింది.

ఈ క్రమంలోనే ఈ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారని వారు ఆరోపించారు. అయితే తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఢిల్లీ మద్యం కేసులో క్లీన్‌చిట్ రావడంతో కల్వకుంట్ల కవిత.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ కేసులో ఊరట లభించడంతో.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని కవిత నిర్ణయించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించేందుకు.. కాలినడకన అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల కొండకు చేరుకోవాలని నిర్ణయించారు.

ఈ మేరకు ఆమె పర్యటనకు సంబంధించిన వివరాలను.. కవిత సన్నిహితులు వెల్లడించారు. ఈనెల 5వ తేదీన కవిత తిరుపతికి చేరుకుంటారని.. అదే రోజున అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమల కొండ ఎక్కనున్నట్లు తెలిపారు. కొండపైకి చేరుకున్న తర్వాత.. ఆ తర్వాతి రోజు అంటే ఈనెల 6వ తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

చాలా కాలంగా తనను వెంటాడుతున్న ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు క్లీన్‌చిట్ రావడంతో ఆమె.. తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆమె ఈడీ, సీబీఐ విచారణలు ఎదుర్కొవడమే కాకుండా అరెస్ట్ అయి.. తీహార్ జైలుకు కూడా వెళ్లారు. దాదాపు 6 నెలల పాటు జైలులో ఉన్నారు.

ఇక కవిత తిరుమల పర్యటన కేవలం ఆధ్యాత్మిక పర్యటన మాత్రమే కాదని.. రాజకీయంగా కూడా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తన భవిష్యత్ రాజకీయాలపై కవిత ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి ద్వారా ప్రజ‌ల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న కవిత.. వచ్చే 2 నెలల్లో కొత్త పార్టీని పెడతానని ఇప్పుటికే తేల్చి చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alipiri
  • delhi liquor case kavitha
  • Delhi Liquor scam
  • kalvakuntla kavitha
  • Kavitha In Tihar Jail
  • new political party
  • Political Plans
  • telangana jagruthi
  • tirumala
  • Tirupati visit

Related News

Delhi High Court deals a blow to Kavitha.

kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై ప్రజా అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం దాని రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. 15 రోజుల్లోనే మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, లేదంటే దరఖాస్తును రద్దు చేస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే దీనిపై న్యాయ పోరాటానికి దిగారు కవిత. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఈ వ్యవహారంలో తాము

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

  • 116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

    TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

  • Kalvakuntla Kavitha arrested

    Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత అరెస్ట్

Latest News

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd