HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Walking To Tirumala At The Age Of 116

TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 04-07-2026 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Walking to Tirumala at the age of 116!
Walking to Tirumala at the age of 116!

తిరుమల శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో 116 ఏళ్ల వయసులో ఒక బామ్మ కాలినడకన కొండ ఎక్కింది. యువకులు సైతం ఆయాసపడే మెట్ల మార్గంలో ఆమె ఏ మాత్రం అలసట లేకుండా నడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

116 ఏళ్ల వయసులోనూ కాలినడకన తిరుమల మెట్లు ఎక్కిన ఓ వృద్ధురాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యువతకే సవాలుగా మారుతున్న ఈ ప్రయాణాన్ని ఆమె అచంచలమైన మనోబలం, దైవభక్తితో పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. #116yearoldwoman#Tirumala #SrivariMettu #HashtagU pic.twitter.com/jjW33rJ7oM

— Hashtag U (@HashtaguIn) July 4, 2026

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వీరిలో కొందరు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడకదారిలో స్వామివారిని చేరుకుంటారు. అయితే, ఈ మార్గంలో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రయాణించడం చాలా కష్టం. అలాంటిది, 116 ఏళ్ల బామ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల మెట్లు ఎక్కుతుండటాన్ని చూసిన ఒక భక్తురాలు వీడియో తీశారు.

 

View this post on Instagram

 

A post shared by Hashtag U (@hashtagu_telugu)

ఈ బామ్మ తమిళనాడుకు చెందిన వారని తెలుస్తోంది. ఆమె మనోబలం, దైవభక్తిని చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. “భక్తి ఉంటే వయసు అడ్డంకి కాదని ఈ బామ్మ నిరూపించారు”, “ఆమె సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకం” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. శారీరక దృఢత్వం కంటే విశ్వాసం గొప్పదని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 116 year old woman
  • alipiri steps
  • Alipiri Walk Way
  • srivari mettu
  • tirumala
  • Tirumala Tirupati Devasthanams (TTD)
  • ttd

Related News

    Latest News

    • Isakapatnam: ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసాకపట్నం’

    • vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

    • Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

    • Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

    • Revanth Reddy: రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు

    Trending News

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd