HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rains In Telangana 4

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 09-07-2026 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rains in Telangana
Heavy rains in Telangana

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 38 రోజులు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగిలిన 17 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతమే నమోదైనట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్ సాగు పరిస్థితులపై వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరి సాగు తీవ్రంగా మందగించగా, ఇతర పంటల సాగు కూడా లక్ష్యానికి చాలా వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో మొత్తం 65,95,645 ఎకరాల్లో వరి సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వర్షాలు ముఖం చాటేయడంతో ఇప్పటి వరకు కేవలం 4,22,340 ఎకరాల్లో మాత్రమే (అంటే 6.40 శాతం) నాట్లు పడ్డాయి. నీటి వనరులు సరిగ్గా లేకపోవడం, సకాలంలో రుతుపవనాలు ఊపందుకోకపోవడంతో అన్నదాతలు వరి నాట్లు వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. వరితో పాటు రాష్ట్రంలో అన్ని రకాల పంటలైన పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాల సాగును పరిశీలిస్తే, మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలుగా అంచనా వేశారు. కానీ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కేవలం 55,31,812 ఎకరాల్లో (41.79 శాతం) మాత్రమే విత్తనాలు నాటడం లేదా పంటలు వేయడం పూర్తయింది. అంటే సగానికి పైగా సాగు భూములు ఇంకా బీడుగానే ఉన్నాయి.

వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం, జూలై నెలలో సగటున 47.6 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా కేవలం 39.9 మి.మీ. మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం తక్కువ. అలాగే జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 177.9 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 154.9 మి.మీ. మాత్రమే కురిసింది. ఇది సీజన్ సగటు కంటే 13 శాతం లోటుగా రికార్డయింది.

లోటు వర్షపాతం ఉన్న 16 జిల్లాల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ ఉన్నాయి. అయితే వర్షాల కొరత కారణంగా జిల్లాల వారీగా సాగు విస్తీర్ణంలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, మహబూబాబాద్, ములుగు, మేడ్చల్, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో పంటల సాగు 25 శాతం కూడా దాటలేదు. ఇక నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట జిల్లాల్లో కొంతవరకు పరవాలేదనేలా 51 శాతం మేర సాగు పనులు జరిగాయి.

వర్షాలు కొంత అనుకూలించిన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో గరిష్టంగా 75 శాతం విస్తీర్ణంలో సాగు చేపట్టారు. రాబోయే రోజుల్లో అయినా భారీ వర్షాలు కురిస్తేనే వరి నాట్లు ఊపందుకునే అవకాశం ఉందని, లేనిపక్షంలో సాగు విస్తీర్ణం మరింత తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • heavy rains
  • Heavy Rains Alert
  • heavy rains forecast
  • heavy rains in hyderabad
  • Heavy rains in Telugu states
  • Telangana Rains alert

Related News

Heavy rain warning for AP...

Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఐదు రోజులపాటు నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సం

  • Landslides triggered by heavy rains in Wayanad...

    Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • Rains inundating Mumbai

    Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

  • Heavy rains in Telangana

    Heavy Rains: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Latest News

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd