HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Delhi High Court Deals A Blow To Kavitha

kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Author : Vamsi Chowdary Korata Date : 08-07-2026 - 11:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi High Court deals a blow to Kavitha.
Delhi High Court deals a blow to Kavitha.

కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై ప్రజా అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం దాని రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. 15 రోజుల్లోనే మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, లేదంటే దరఖాస్తును రద్దు చేస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే దీనిపై న్యాయ పోరాటానికి దిగారు కవిత. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఈ వ్యవహారంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ముందుగా ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన రీతిలో సమాధానం ఇవ్వాలని కవితకు ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ‘తెలంగాణ రక్షణ సమితి’ అనే పేరును ప్రతిపాదిస్తూ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ పేరు పాత టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రస్తుతం బీఆర్ఎస్) పేరును పోలి ఉండేలా, అదే అర్థం వచ్చేలా ఉందంటూ ఈసీ జూన్ 23వ తేదీన కవితకు ఒక లేఖ పంపింది. కొత్త పార్టీకి ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలే తప్ప.. పాత టీఆర్ఎస్ గుర్తులను పోలిన విధంగా ఎలాంటి పేర్లు ఉండకూడదని ఆ లేఖలో ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం పంపిన ఈ లేఖను సవాల్ చేస్తూ.. తమ పార్టీ పేరును తక్షణమే ఖరారు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం.. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించింది. ‘తెలంగాణ రక్షణ సమితి’ లేదా ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేర్లు పాత ‘టీఆర్ఎస్’ పార్టీకి దగ్గరగా ఉన్నాయనే ఈసీ అభ్యంతరంలో హేతుబద్ధత ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈసీ పంపిన నోటీసులకు, అభ్యంతరాలకు పిటిషనర్ ముందుగా సరైన రీతిలో మరియు చట్టబద్ధంగా సమాధానాలు చెప్పుకోవాలని సూచించింది. ఈసీ తుది నిర్ణయం తీసుకోకముందే కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తే.. అది నేరుగా ఎన్నికల సంఘం విధుల్లో, అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈసీ పరిధిలోని అంశాలపై అక్కడే సమాధానాలు ఇచ్చి స్పష్టత తెచ్చుకున్న తర్వాతే.. అవసరమైతే కోర్టు మెట్లు ఎక్కాలని స్పష్టం చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు కీలక దిశానిర్దేశం చేసింది.

కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈసీ అభ్యంతరాలు, కోర్టు వ్యాఖ్యలతో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత టీఆర్ఎస్ సెంటిమెంట్‌ను కొనసాగించేలా కాకుండా పూర్తిగా సరికొత్త పేరుతో ఆమె ముందుకు వెళ్తారా? లేక ఈసీ నోటీసులకే గట్టి సమాధానాలు ఇచ్చి ‘తెలంగాణ రక్షణ సమితి’ పేరుపైనే పట్టుబడతారా? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • delhi high court
  • ElectionCommission
  • kalvakuntla kavitha
  • trs party

Related News

Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

వినియోగదారులు సృష్టించే కంటెంట్‌ను చురుకుగా పర్యవేక్షించాల్సిన చట్టపరమైన బాధ్యత మధ్యవర్తులకు లేదని, నిర్దిష్ట కంటెంట్ లేదా యూఆర్‌ఎల్‌లను గుర్తించినప్పుడు మాత్రమే వారు చర్యలు తీసుకోగలరని ఈ టెక్ దిగ్గజాలు వాదించాయి. ఏది చట్టబద్ధమో, ఏది కాదో నిర్ణయించే బాధ్యత గల “సూపర్ సెన్సార్లు”గా మధ్యవర్తులను మార్చలేమని వాదిస్తూ, వినియోగదారులు అప్‌లోడ్ చేసిన చట్టవిరుద్ధమైన

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

  • Kalvakuntla Kavitha arrested

    Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత అరెస్ట్

Latest News

  • US-Iran War: ఇరాన్‌పై అమెరికా దాడులను సమర్థించిన నాటో అధినేత

  • Nara Lokesh: ఏపీకి క్యూ కట్టనున్న కొరియా కంపెనీలు

  • kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Cotton: తెలంగాణలో పత్తి సాగుకు వాతావరణ సవాళ్లు

  • Jnaneswari Missing: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd