HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjps Strength Is The Gain For Brs How Is It Possible

BRS & BJP : బిజెపి బలమే బీఆర్ఎస్ కు లాభం.. అదెలా..?

తమ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలి, దాన్ని తమకు సానుకూలతగా ఎలా మలుచుకోవాలనే ప్రయత్నాలలో BRS మునిగిపోయింది.

  • By Hashtag U Published Date - 05:31 PM, Tue - 24 October 23
  • daily-hunt
BRS
Bjp's Strength Is The Gain For Brs.. How Is It..

By: డా. ప్రసాదమూర్తి

BRS & BJP : తెలంగాణలో ఎన్నికల యుద్ధానికి సకల పక్షాలూ సన్నద్ధమవుతున్నాయి. తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకొని పార్టీలు ముందుకు కదులుతున్నాయి. అధికార బిఆర్ఎస్ మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని సర్వశక్తులూ వొడ్డి ప్రయత్నాలు సాగిస్తోంది. బీఆర్ఎస్ (BRS) బల అంతా కేసీఆరే. ఆయన మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఏకైక ప్రచారాస్త్రాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఇతర నాయకులు ఈ ఎన్నికలలో ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన ప్రాణాన్ని కూడా బలివ్వడానికి సిద్ధపడిన కేసీఆర్ ని ముందు పెడితే, తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులంతా భావిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను మరింత మెరుగైనవిగా మలచి, బిఆర్ఎస్ తమ ఎన్నికల ఎజెండాను ప్రజల ముందు ఉంచింది. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పటివరకూ వెల్లడైన సర్వేలు చెబుతున్నది ఒకటే. అధికార బీఆర్ఎస్ (BRS) కు ప్రజల్లో వ్యతిరేకత చాలా మేరకు చోటుచేసుకుందనేదే సర్వేల మాట. అది ఈ ఎన్నికల్లో అధికార మార్పిడికి దోహదం చేసే స్థాయిలో ఉందా లేదా అనే మాట అలా ఉంచి, బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలంటే ఈ వ్యతిరేకతను అధిగమించాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

అందుకే బీఆర్ఎస్ (BRS) ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా వదలడం లేదు. నియోజకవర్గ స్థాయిలో వార్ రూమ్ లు పెట్టి, ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పోల్ మేనేజర్ ని పెట్టి, ఎన్నికల ప్రచార రణరంగంలో సమస్త ఆస్త్రాలనూ వదులుతోంది. కానీ అంతటితో ఆగకుండా తమ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలి, దాన్ని తమకు సానుకూలతగా ఎలా మలుచుకోవాలనే ప్రయత్నాలలో బీఆర్ఎస్ మునిగిపోయింది. రెండుసార్లు తమ పాలనను చూసిన ప్రజలు మూడోసారి మరొక పార్టీకి అధికారాన్ని కట్టబెట్టే అవకాశం ఉందేమో అన్న అనుమానం అధికార పార్టీ నేతలకు లేకపోలేదు. అందుకే ఈసారి తమ విజయం నల్లేరు మీద బండి నడక కాదని తెలుసుకొని అందరికంటే ముందుగా ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. ఇదంతా ఒక ఎత్తు. బీఆర్ఎస్ కు తగ్గిన బలాన్ని మరో రకంగా పూడ్చుకునే అవకాశం చిక్కుతోంది. అదే ఈ ఎన్నికలలో ప్రజలు చూడబోయే అతి గొప్ప విచిత్రం కావచ్చు. మరో పార్టీ బలాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాన్ని ఈ ఎన్నికలలో కాలం బీఆర్ఎస్ కు కల్పించిందని చెప్పడానికి అనేక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ఈసారి ఎన్నికలు చేసే మాయాజాలం కావచ్చు.

తెలంగాణలో ముక్కోణపు పోటీ ఉంటుంది. కానీ ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీకి అధికార బీఆర్ఎస్ పార్టీకి మధ్యనే ఉంటుందనే విషయం కూడా స్పష్టమైపోయింది. ఈ రెండు పార్టీల ఓట్ల శాతం లో పెద్ద తేడా ఉండకపోవచ్చు. ఒకటి, రెండు శాతం ఓట్ షేరింగ్ షిఫ్ట్ అయితే సీట్లలో భారీ తేడా చోటు చేసుకుంటుంది. అదే ఒకరి విజయానికి మరొకరి పరాజయానికి కారణం అవుతుంది. అధికార పార్టీకి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నది అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. కానీ సర్వేల ద్వారా మాత్రం బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయేంత మోతాదులో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అని తెలుస్తుంది. కానీ ఓట్ షేరింగ్ లో పెద్ద తేడా ఎక్కడా కనబడడం లేదు. అంటే ఒకటి రెండు శాతం అటూ ఇటూ తారుమారైతే జయాపజయాలు కూడా తారుమారైపోతాయి. ఇక్కడే ముక్కోణపు పోటీలో జరిగే విచిత్రాన్ని మనం చూసే అవకాశం ఉంది. బిజెపి (BJP) పార్టీ, ఏ సర్వే ప్రకారం చూసినా ఏడెనిమిది సీట్లు కంటే ఎక్కువగా తెచ్చుకునే అవకాశం కనిపించడం లేదు. అంటే చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ మూడో స్థానంలో ఉండిపోతుంది. కానీ ఆ పార్టీ చాలా చోట్ల బలమైన అభ్యర్థులని నిలబెడుతుంది.

వారు విజేతలుగా నిలవకపోయినా ఓట్లు సంపాదించగలిగే సత్తా ఉన్నవారే. అంటే బిజెపి (BJP) సంపాదించే ఓట్లు అధికార పార్టీ వ్యతిరేక ఓట్లే. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తాము గెలవకపోయినా అత్యధిక స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయవకాశాలను బిజెపి (BJP) గణనీయంగా దెబ్బతీసే అవకాశం ఉందని అర్థమవుతుంది. అధికార బిఆర్ఎస్ పార్టీకి తాము కోల్పోయిన బలాన్ని బిజెపి ద్వారా మరో రూపంలో మరో మార్గంలో తిరిగి పొందే అవకాశం దొరుకుతుంది. కేవలం రెండు పార్టీలే పోటీలో ఉంటే ప్రజలు అటో ఇటో ఓటు వేస్తారు. మూడో పక్షం లేకపోతే అధికార పార్టీకి అనుకూల ఓటు, ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేక ఓటు పడుతుంది. అనుకూలత బలంగా ఉంటే అధికార పార్టీ గెలుపొందుతుంది. వ్యతిరేకత బలంగా ఉంటే ప్రతిపక్షానికి మేలు జరుగుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అటు అధికార పార్టీని ఢీకొనాలి, అదే సమయంలో బిజెపికి డిపాజిట్లు కూడా దక్కకుండా చేయగలగాలి. అసలు ప్రశ్న ఇదే.

తాము అధికారంలోకి వస్తామని ముందు ఎంతో గొప్పలు చెప్పుకున్న బీజేపీ రాను రాను తెలంగాణలో హంగ్ రాబోతుందని ప్రచారం మొదలుపెట్టింది. హంగ్ వచ్చినా రాకపోయినా, బిజెపి బరిలో ఉన్నచోట పరాజయం పాలైనా, ఓటు శాతాన్ని కొంచెం అధికంగా సంపాదించుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవడం సాధ్యం కాదు. ఆ విధంగా బిజెపి బలం తమ పార్టీ అభ్యర్థులకు ఉపయోగపడకపోయినా బీఆర్ఎస్ కు మాత్రం బాగా ఉపయోగపడుతుంది.

ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అయాచితంగా దక్కిన గొప్ప వరం బిజెపి అనుకోవాలి. తెలంగాణలో హంగ్ వస్తే ఎవరు ఎవరికి మద్దతిస్తారు అనేది ఎన్నికల అనంతరం తేలుతుంది. కానీ అధికార బీఆర్ఎస్ కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కొద్దో గొప్పో తమ పార్టీ వైపు బిజెపి లాగగలిగితే అది అధికార పార్టీకి నెత్తిమీద పాలు పోసినట్టే. బిజెపి ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసింది. అందులో నాయకులు చాలామంది గట్టి వారే ఉన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి 50 రోజులు ముందుగానే తన అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ప్రకటించింది. దీనివల్ల అధికార పార్టీకి ఎంతవరకు మేలు జరుగుతుంది.. లేదా ఏమైనా ఎదురు దెబ్బతినే అవకాశం ఉందా అనేది ఎన్నికల అనంతరం మాత్రమే మనం తెలుసుకోగలం.

కానీ అభ్యర్థుల ప్రకటనలో ఇటు కాంగ్రెస్ కానీ, బిజెపి గానీ ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనలో మాత్రం అధికార పార్టీ అందర్నీ మించి ముందుంది. ఇలా తమ అభ్యర్థులకు తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పనులు ప్రజలకు వివరించి, కొత్త పనులు మరిన్ని చేపట్టి, వాటికి కావాల్సిన శాంక్షన్లు చేయించుకొని ప్రచారంలో ముందుండే అవకాశాన్ని అధికార పార్టీ కల్పించింది. అంతేకాదు ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక దశ ప్రచారాన్ని ముగించి. బీఆర్ఎస్ ఈ విషయంలో కూడా కాంగ్రెస్, బిజెపిల కంటే చాలా ముందే ఉంది.

తమ ముందు ఉన్న ఏ అవకాశాన్నీ బీఆర్ఎస్ నాయకులు వదులుకోవటం లేదు. ఇలా తమ ప్రయత్నాల్లో ఎలాంటి లోపం లేకుండా చేసుకుంటూ పోతే, అనుకోకుండా కలిసి వచ్చే అనుకూలాంశాలు కొన్ని తమను విజయ తీరాల వైపు తీసుకుపోవచ్చు. ఈ ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఘనత తమ బలానిది కాకుండా బిజెపి బలానిది కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది. చూసారా.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం.

అధికార పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా కైవసం చేసుకోలేని విషాద పరిణామాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎదుర్కొంటుందా, లేక ప్రభుత్వ వ్యతిరేకతను సంపూర్ణంగా తమవైపే మలుచుకునే చాకచక్యాన్ని, శక్తి యుక్తుల్నీ ప్రదర్శిస్తుందా అనేది మనం ఎదురు చూడాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ మన బలంతో కాకుండా ఒక్కోసారి ఎదుటివారి బలంతో కూడా మనమే గెలవవచ్చు అని బీఆర్ఎస్ నిరూపించే అవకాశం ఈ ఎన్నికలలో లేకపోలేదు. రాజకీయ రంగస్థలం పై చిత్ర విచిత్రాలు అంటే ఇవే.

Also Read:  TDP : అధికారం కోసం వైసీపీ అడ్డ‌దారులు తొక్కుతుంది – టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • brs
  • Gain
  • hyderabad
  • kcr
  • ktr
  • modi
  • Strength
  • telangana

Related News

TGPSC

TGPSC: రేపు గ్రూప్- 2 తుది ఫలితాలు విడుదల?

మరోవైపు TGPSC నియామక ప్రక్రియలో వేగాన్ని ప్రదర్శిస్తూ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లోని ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.

  • High Court

    High Court: నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వ‌హిస్తే న‌ష్ట‌మేంటి?: హైకోర్టు

  • CM Revanth Reddy

    Telangana: టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ. 15,279 కోట్ల పెట్టుబడులు.. 50 వేల ఉద్యోగాలు!

  • Modi Pawan Cbn

    Modi Tour : ఏపీలో మోడీ పర్యటన..ఎప్పుడంటే !!

  • Schedule For Mlas Disqualif

    Telangana Assembly : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదల

Latest News

  • TVK Vijay Rally in Stampede : కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

  • Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్

  • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

  • Invest in Telangana : రాష్ట్రానికి రూ.15,279 కోట్ల పెట్టుబడులు- CMO

  • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

Trending News

    • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

    • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd