HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Sun Is Getting Darker In Telangana

తెలంగాణలో ముదురుతున్న ఎండలు

  • Author : Vamsi Chowdary Korata Date : 06-03-2026 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heatwave Alert
Heatwave Alert
Summer  తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న‌ ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్‌లలోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాబోయే రోజులకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ప్రకటించారు. ఈ వారంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 1.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ వైపు పొడి, వేడి గాలులు వీస్తుండటమే ఈ తీవ్రతకు ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.

శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడేవారు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, వారు మరింత జాగ్రత్తగా చల్లని ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhadradri kothagudem district
  • Heat Wave
  • Heatwave alert
  • IMD orange alert
  • mulugu
  • Nalgonda
  • orange alert
  • summer
  • telangana
  • Telangana Weather
  • Telangana weather alert
  • Telangana weather news
  • Telangana Weather Update

Related News

Omkareshwara Temple

Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Musi River  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పా

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Refreshing Summer Drink

    Heatwave: వేసవిలో ఒంట్లో వేడిని తరమికొట్టే సూపర్‌ డ్రింక్ ఇది..!

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

Latest News

  • Balakrishna Heroine : బాలయ్య హీరోయిన్ కు చేదు అనుభవం..ఫోటో అంటూ నడుముపై చెయ్యి వేసి ..

  • Pakistan Deputy Prime Minister: పాక్‌ ఉప ప్రధానికి పరువు పాయే..

  • Delhi : ఢిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం .. లష్కరే టెర్రరిస్టు అరెస్టు

  • TG Legislative Council : పోడియం వద్ద దూసుకువచ్చిన బిఆర్ఎస్ సభ్యులు.. మండలి నుంచి సస్పెన్షన్

  • Gold Price : బంగారం పతనం..కొనుగోలు దారులకు ఇదే ఛాన్స్

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd