HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Acbs Case Against Ktr Lawyers Who Took Refuge In The High Court

Case Against KTR: కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. హైకోర్టును ఆశ్ర‌యించిన న్యాయ‌వాదులు

హై కోర్టులో లంచ్ మోష‌న్ పిటిషన్ ను కేటీఆర్ న్యాయవాది దాఖ‌లు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో పిటిష‌న్‌ను కేటీఆర్ న్యాయ‌వాది మెన్షన్ చేశారు.

  • Author : Gopi Date : 20-12-2024 - 11:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Case Against KTR
Case Against KTR

Case Against KTR: తెలంగాణ ఫార్ములా ఈ- రేసు వ్యవహారంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (Case Against KTR) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత దీనిపై విచారించాలని కోరారు. ఈ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై నేడు ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

లంచ్‌ మోషన్‌ పిటిషన్ వేసిన కేటీఆర్ న్యాయ‌వాది

హై కోర్టులో లంచ్ మోష‌న్ పిటిషన్ ను కేటీఆర్ న్యాయవాది దాఖ‌లు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో పిటిష‌న్‌ను కేటీఆర్ న్యాయ‌వాది మెన్షన్ చేశారు. సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు కేటీఆర్ న్యాయవాది వెళ్లారు. ఈ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపింది. దీంతో చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ పిటిష‌న్‌ను కేటీఆర్ న్యాయ‌వాదులు దాఖ‌లు చేశారు. లంచ్ మోషన్ పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మధ్యాహ్నం 2:15గంట‌ల‌కు హై కోర్టులో విచారణ ఉండే అవకాశం ఉంది.

Also Read: Hanuman: స్త్రీలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎందుకు తాకకూడదో తెలుసా?

ఏ1గా కేటీఆర్‌

తెలంగాణ‌లో గ‌తేడాది నిర్వ‌హించిన‌ ఫార్ములా ఈ కార్‌ రేసు వ్యవహారంపై ఏసీబీ గురువారం కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏ-1గా ఏసీబీ పేర్కొంది. ఏ-2గా ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌, ఏ-3గా హెచ్‌ఎండీ చీఫ్ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేటీఆర్‌పై విచారణ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ అనుమతి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌య‌మై అసెంబ్లీ వేదిక‌గా మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావులు సైతం స్పందించారు. సీఎం రేవంత్‌కు ద‌మ్ముంటే ఈ విష‌య‌మై అసెంబ్లీలో చ‌ర్చ పెట్టాల‌ని డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB
  • ACB Case
  • brs
  • CM Revanth Reddy
  • congress
  • E- Car Race
  • High Court
  • ktr
  • politics
  • telangana
  • telangana politics

Related News

CM Revanth Reddy's meeting cancelled.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధిర నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగ

  • Bail period ends... Bandi Bhagirath returns to Cherlapally Jail.

    Bandi Bhageerath: ముగిసిన బెయిల్ గడువు.. మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

  • BRS leader Balka Suman released on bail from Chanchalguda Jail.

    Balka Suman: చంచల్‌గూడ జైలు నుంచి బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌కు బెయిల్‌ పై విడుదల

  • We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

    Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Janasena strengthens its position in Telangana politics; another key decision taken recently.

    Janasena Party: తెలంగాణ రాజకీయాల్లో జనసేన బలోపేతం.. తాజాగా మరో కీలక నిర్ణయం

Latest News

  • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

  • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

  • RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

  • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

  • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd