HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Warns State Congress Leaders

Revanth Warning : రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR - Special Intensive Revision) గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

  • Author : Latha Suma Date : 19-07-2026 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.
We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR – Special Intensive Revision) గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి నిర్వహించిన అత్యవసర జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ఈ ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను అస్సలు సీరియస్‌గా తీసుకోవడం లేదని, చాలా మంది నాయకులు తమ క్షేత్రస్థాయి బాధ్యతలను వదిలేసి హైదరాబాద్‌లోని ఏసీ గదుల్లోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. కేవలం పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసమే గాంధీభవన్‌ చుట్టూ తిరిగే సంస్కృతిని ఇకనైనా వీడాలని, ఆగస్టు 3వ తేదీ వరకు ఏ ఒక్క నేత కూడా గాంధీభవన్‌ మెట్లు ఎక్కడానికి వీల్లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు.

రాబోయే 10 రోజులు ఎన్నికల ప్రచారంలా సాగాలి.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు!

ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ అనేది 2028 అసెంబ్లీ ఎన్నికలకు పునాది వంటిదని, ఇందులో జరిగే చిన్న పొరపాటైనా పార్టీకి భారీ నష్టం కలిగిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకే రాబోయే 10 రోజుల పాటు ప్రతి లీడర్ తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. కేవలం ప్రభుత్వ బూత్ స్థాయి అధికారుల (BLO) నివేదికలపైనే ఆధారపడకుండా, పార్టీ నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లను (BLA) చురుగ్గా వాడుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థంగా పని చేయని ఎంపీలు, ఇన్‌ఛార్జులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని, అవసరమైతే బాధ్యతల నుంచి తప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాగే, ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే 100 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను (BLAs) స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిపించి, ఫోటో దిగే సువర్ణావకాశాన్ని కల్పిస్తామని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • CM Revanth Reddy Warning
  • Electoral Rolls Extension
  • Special Intensive Revision (SIR)
  • Telangana Congress Zoom Meeting

Related News

KTR warns CM Revanth

KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

తెలంగాణలో ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఉద్యోగ ‘నోటిఫికేషన్ల’ స్థానంలో ‘లూటిఫికేషన్లు’ చేస్తున్నారని విమర్శించారు. సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘యువ సంగ్రామ’ సదస్సులో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రేవంత్ గుర్తు పెట్

  • Smart Ration Cards in Telangana

    Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • Good news for liquor lovers in Telangana.

    Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

  • New pensions... Minister Seethakka shares good news for single women.

    Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

  • Telangana government's key decision... fantastic news for Gram Panchayats...

    Telangana Govt: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు అదిరిపోయే శుభవార్త..

Latest News

  • Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. !!

  • Wife Killed Husband : ఆరు నెలల్లో దేశంలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు చనిపోయారో తెలుసా ?

  • CJP ‘Chalo Parliament’ : రేపు CJP ‘ఛలో పార్లమెంట్’.. ఢిల్లీలో హైఅలర్ట్

  • UP : గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

  • J&K Cloudburst Tragedy: జమ్మూలో ప్రకృతి బీభత్సం.. 15 మందికిపైగా మృతి

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd