HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News For Liquor Lovers In Telangana

Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 18-07-2026 - 9:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for liquor lovers in Telangana.
Good news for liquor lovers in Telangana.

ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయానికి తెరలేపింది. థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లను వీక్షించే ఫుట్‌బాల్ అభిమానులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే మందుబాబులకు శుభవార్త చెప్పింది. క్లబ్బులు, బార్లు, మైక్రోబ్రూవరీల మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు.. ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగే జూలై 18వ తేదీ (శనివారం) రాత్రి నుంచి జూలై 19వ తేదీ (ఆదివారం) తెల్లవారుజామున 4.30 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చారు. అదే సమయంలో జూలై 19వ తేదీ (ఆదివారం)న జరిగే ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జూలై 20వ తేదీ (సోమవారం) తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి మంజూరు చేశారు.

అయితే.. ఈ ప్రత్యేక వెసులుబాటు రాష్ట్రవ్యాప్తంగా కాకుండా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 2బీ బార్లు, సీ1 క్లబ్బులు, టీడీ-1, టీడీ-2 లైసెన్సులు కలిగిన సంస్థలు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలోని సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రీడా ఈవెంట్లలో ఫిఫా వరల్డ్ కప్ ఒకటి. భారత కాలమానం ప్రకారం ఫైనల్, థర్డ్ ప్లేస్ మ్యాచ్‌లు అర్ధరాత్రి తర్వాత జరుగుతుండటంతో ఫుట్‌బాల్ అభిమానులు పెద్ద సంఖ్యలో స్పోర్ట్స్ బార్లు, క్లబ్బుల్లో మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాలు, ప్రేక్షకుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం పొడిగించిన సమయాల్లో కూడా అన్ని బార్లు, క్లబ్బులు ఎక్సైజ్ నిబంధనలు, శాంతిభద్రతల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఫిఫా ఫైనల్స్ సందర్భంగా హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఫీవర్ మరింత పెరగనుండగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం క్రీడాభిమానులకు, హాస్పిటాలిటీ రంగానికి ఊరటనివ్వనుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • FIFA world cup
  • FIFA World Cup Finals
  • liquor
  • telangana

Related News

KTR warns CM Revanth

KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

తెలంగాణలో ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఉద్యోగ ‘నోటిఫికేషన్ల’ స్థానంలో ‘లూటిఫికేషన్లు’ చేస్తున్నారని విమర్శించారు. సరూర్‌నగర్‌లో నిర్వహించిన ‘యువ సంగ్రామ’ సదస్సులో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రేవంత్ గుర్తు పెట్

  • Smart Ration Cards in Telangana

    Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • New pensions... Minister Seethakka shares good news for single women.

    Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

  • Telangana government's key decision... fantastic news for Gram Panchayats...

    Telangana Govt: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు అదిరిపోయే శుభవార్త..

  • Groundwater levels falling in Telangana... Is a water crisis inevitable this summer?

    Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?

Latest News

  • Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

  • Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

  • Sonam Wangchuk: ‘నోటి ద్వారా లేదా IV ద్వారా మందులు వద్దు…’: చికిత్సకు ముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి అని సోనమ్ వాంగ్‌చుక్ భార్య డిమాండ్

  • Kuwait Desalination Plant: ఇరాన్ మొదట కువైట్ విద్యుత్, నీటి డీశాలినేషన్ ప్లాంట్ పై దాడి.. ఆపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది..

  • RAW NTR: ఎన్టీఆర్ ను కలిసే అర్హత మాకు లేదా? మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd