CM Revanth Padayatra: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర.. షెడ్యూల్ ఇదే!
ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2: 30 గంటలకు సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించి.. భీమ లింగ వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారు.
- By Gopichand Published Date - 06:30 AM, Fri - 8 November 24

CM Revanth Padayatra: మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు (CM Revanth Padayatra) నవంబర్ 8న సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2: 30 గంటలకు సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించి.. భీమ లింగ వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారు.
Also Read: Instructions Of CS: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. సీఎస్ కీలక ఆదేశాలు..!
సీఎం రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే
- మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు బయల్దేరతారు.
- ఉదయం 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామికి దర్శనం, పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
- ఉదయం 11.30కు యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
- మధ్యాహ్నం 1.30కి రోడ్డు మార్గంలో సంగెం బయలుదేరతారు.
- సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్ర ప్రారంభించనున్నారు.
- సంగెం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభం కానుంది
- మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు సీఎం రేవంత్ పాదయాత్ర చేయనున్నారు.
- అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం- నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేస్తారు.
- అక్కడే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.
- ప్రసంగం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.