Telugu News
-
#Telangana
Telangana Floods: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాలు మరియు కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, సిఎం రేవంత్ రెడ్డి వరదల తీవ్ర ప్రభావాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
Date : 02-09-2024 - 3:13 IST -
#Andhra Pradesh
CM Chandrababu: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఎస్ఐ తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్
కోడూరుకు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ శిరీష భద్రతా విధుల్లో విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆపదలో ఉన్న విద్యార్థుల పట్ల ఇలాంటి దుష్ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఎంతమాత్రం సహించబోమని, అధికారి తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు
Date : 01-09-2024 - 1:54 IST -
#Speed News
AP-TS Rains: తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-కాజీపేట మార్గంలో దాదాపు 24 రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్‌పై నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు
Date : 01-09-2024 - 12:41 IST -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ ఎత్తుగడ, మోడీతో డీల్
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వచ్చేలా చూడడానికి పిసిబి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్ ను రప్పించేందుకు రెడీ అయింది. అక్టోబర్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ధృవీకరించారు
Date : 30-08-2024 - 5:21 IST -
#Telangana
Hyderabad: వేములవాడ ఆలయ అర్చకుల ఆశీస్సులు అందుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
వేములవాడ ఆలయ అభివృద్ధి నిధుల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి ఆశీస్సులు అందజేశారు
Date : 30-08-2024 - 2:45 IST -
#Telangana
CM Revanth Reddy: సుప్రీం కోర్టుకు సారీ చెప్పిన సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య జరిగిన డీల్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించాయి. కోర్టుకు క్షమాపణలు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాను మాట్లాడిన మాటలను న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టుగా వక్రీకరించారని++++
Date : 30-08-2024 - 2:05 IST -
#Special
Digital Arrest scam: డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఎలా చేస్తారు ?
డిజిటల్ అరెస్టులో నేరస్థుడు బాధితుడిని మానసికంగా ప్రభావితం చేస్తాడు. నేరస్థుడు ఆన్‌లైన్ ద్వారా ఎవరినైనా బుట్టలో పడేస్తాడు. ఎదో రకంగా మాయమాటలతో తనవైపుకు తిప్పుకుంటాడు. ఇందులో వీడియో కాల్ లేదా ఫోన్ కాల్ ద్వారా బాధితుడిని మోసం చేస్తాడు. నేరస్థుడు పోలీసు అధికారిగా లేదా ఏదైనా ప్రభుత్వ ఉన్నత అధికారిగా నటిస్తూ బాధితుడిని తీవ్రంగా భయపెడతాడు.
Date : 30-08-2024 - 12:51 IST -
#Telangana
Hyderabad Water Band: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్
ఆగస్టు 30 శుక్రవారం, ఆగస్టు 31 రాత్రి 9 గంటల వరకు 24 గంటల తాగునీటి సరఫరా ఉండదని హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి తెలిపింది. రియాసత్ నగర్‌లో, రాజా నరసింహ కాలనీ, ఇంద్ర నగర్, పిసల్ బండ, దర్గా బురాన్‌షాహి, గాజీ-మిల్లత్, జీఎం చౌని, లలితా బాగ్, ఉప్పుగూడ, మిధాని, ఒవైసీ హాస్పిటల్‌లో
Date : 30-08-2024 - 11:22 IST -
#India
Kolkata Doctor Rape: కోల్‌కతా డాక్టర్ కేసులో కొత్త ట్విస్ట్, సంచలనంగా మారిన కాల్ రికార్డింగ్
మహిళ డాక్టర్ తెల్లవారుజామున 3:00 నుండి 4:00 గంటల మధ్య మరణించారు. అయితే తల్లిదండ్రులకు మొదటి కాల్ 10:50 వెళ్ళింది. మొదటి కాల్‌లో మీ కుమార్తె అనారోగ్యంగా ఉందని చెప్పారు. కొంత సమయం తర్వాత రెండో కాల్ వెళ్ళింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని డాక్టర్ కూతురి తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపారు. అయితే కూతురి తల్లిదండ్రులకు డాక్టర్ అబద్ధం చెబుతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది
Date : 30-08-2024 - 9:25 IST -
#Andhra Pradesh
Kadambari Jethwani Case: కాదంబరి జేత్వాని కేసులో ఏపీ పోలీసుల విచారణ, సీఎం చంద్రబాబు ఆదేశాలు
ముంబయికి చెందిన నటి కాదంబరి జెత్వానిని అక్రమంగా విజయవాడకు తీసుకు వచ్చి, చిత్రహింసలకు గురి చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు నటిని ఆన్ లైన్ లో విచారించారు.
Date : 30-08-2024 - 8:43 IST -
#India
Haryana Elections 2024: ఎన్నికల ప్రచారంలో చిన్నారి, చిక్కుల్లో బీజేపీ
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల సంబంధిత కార్యకలాపాలకు పిల్లలను ఉపయోగించుకోవడం విరుద్ధం. హర్యానా బీజేపీ తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ నోటీసును జారీ చేశారు.
Date : 28-08-2024 - 10:38 IST -
#India
Champai Soren Resigns: చంపై సోరెన్ రాజీనామా, ఉత్కంఠగా జార్ఖండ్ రాజకీయాలు
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముక్తి మోర్చాకు రాజీనామా చేశారు. దీంతో అతని జేఎంఎంతో సుదీర్ఘ జర్నీకి తెరపడింది. కాగా ఆగస్టు 30న బీజేపీలో చేరనున్నారు. .చంపాయ్ సోరెన్ బుధవారం న్యూఢిల్లీ నుంచి నేరుగా రాజధాని రాంచీకి చేరుకున్నారు. దీంతో ఆయన భవిష్యత్ వ్యూహం ఏమిటనే సందేహాలకు తెరపడింది
Date : 28-08-2024 - 9:27 IST -
#Sports
Zaheer as LSG Mentor: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్ ఖాన్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ లక్నోతో జత కట్టనున్నాడని సంజీవ్ గోనికా ప్రకటించారు. ప్రస్తుతం లక్నో జట్టుకి జహీర్ ఖాన్ మెంటర్ గా, జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా, లాన్స్ క్లూసెనర్ మరియు ఆడమ్ వోజెస్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. జహీర్ ఖాన్ 2008లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసాడు. చివరిగా 2017లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు
Date : 28-08-2024 - 4:55 IST -
#India
10 Years of PMJDY: నాలుగేళ్ల పనిని ఐదు నెలల్లో ఎలా పూర్తి చేశారో చెప్పిన నీతి ఆయోగ్
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పథకం తొలుత ప్రారంభించడానికి నాలుగేళ్లు అనుకోగా, మోడీ మాత్రం కేవలం ఐదు నెలల కాలంలోనే ప్రారంభించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Date : 28-08-2024 - 3:07 IST -
#Andhra Pradesh
AP Cabinet: రివర్స్ టెండరింగ్ రద్దుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Date : 28-08-2024 - 2:38 IST