HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Precautions To Take To Prevent Dehydration During Summer

వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • Author : Vamsi Chowdary Korata Date : 14-03-2026 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dehydration
Dehydration

Dehydration Symptoms  రోజూ తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. అసలే ఎండాకాలం ప్రారంభదశలో ఉన్నాం. తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో తయారైంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాకుండా జీర్ణక్రియ, రక్త ప్రసరణ, విష పదార్థాల తొలగింపులో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, శరీరంలో నీరు లేకపోవడం చాలా ప్రమాదకరం. శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితిని డీహైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషన్‌కి గురైతే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

ఎండాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో చాలా మంది డీహైడ్రేట్ అవుతుంటారు. నీరు తాగకపోవడం, తాగినా చెమట, మూత్రం రూపంలో బయటికి వెళ్లిపోవడం కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే, సమస్య పెరిగినప్పుడు ముఖ్యంగా ఎండాకాలంలో అది కొన్నిసార్లు ప్రమాదంగా మారుతుంది. అలాంటప్పుడు డీహైడ్రేట్ అయిందని ఏ లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. సమస్య తగ్గేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.

మన బాడీ కావాల్సిన దానికంటే ఎక్కువ నీటిని వాడినప్పుడు, మన బాడీలో పూర్తిగా నీరు కోల్పోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుందని మయోక్లినిక్ చెబుతోంది.అప్పుడు బాడీ మళ్ళీ తిరిగి సాధారణ పనిని చేయడానికి తగినంత నీరు, వేరే లిక్విడ్స్ ఉండవు. కోల్పోయిన ద్రవాల కారణంగా డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఎవరైనా డీహైడ్రేషన్‌కి గురవుతారు. కానీ పిల్లలు, వృద్ధుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది.

అదే విధంగా, చిన్నపిల్లలు డీహైడ్రేట్ కావడానికి మరో రీజన్ కూడా ఉంది. అందులో విరోచనాలు, వాంతులు. పెద్దవారిలోనూ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా చెమట పట్టడం, జ్వరం, విరోచనాలు, వాంతులు ఉంటే సమస్య ఉంటుంది. తగినంత నీరు తీసుకోకపోయినా, మూత్ర ఉత్పత్తిని తీసుకునే మెడిసిన్స్ తీసుకున్నా సమస్య వస్తుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక చెబుతోంది. ఇక వృద్ధుల శరీరంలో తక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. దీని వల్లే వారిలోనూ సమస్య వస్తుంది.

బాడీలో హైడ్రేషన్ తగ్గినప్పుడు

మయో క్లినిక్ ప్రకారం బాడీలో సరైన హైడ్రేషన్ లేనప్పుడు ఆటోమేటిగ్గా దాహం ఉంటుంది. అలాంటప్పడు వెంటనే ఏవైనా లిక్విడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా నీటిని తీసుకోవాలి. మీరు ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుంటే డీహైడ్రేషన్‌ని నేచురల్‌గానే తగ్గించొచ్చు. అయితే, దీనికోసం ముందుగా డీహైడ్రేషన్‌ని గుర్తించాలి. ఇది నీరు తాగని వృద్ధులు, పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఒకరికి సమస్య పెరిగితే ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే, తీవ్రమైన డీహైడ్రేషన్ ప్రాణాంతకం అవుతుంది.

నీటిని తీసుకోవడం వల్ల లాభాలు

దాదాపు 78 శాతం నీటితో తయారైన మన బాడీకి నీరు చాలా ముఖ్యం. అందుకే, ఎక్కువగా నీరు తాగాలి. దీని వల్ల సరైన విధంగా జీర్ణమవ్వడానికి హెల్ప్ అవుతుంది. వ్యర్థాలన్నీ బయటికి వెళ్తాయి. కీళ్ళు పనిచేస్తాయి. లాలాజలం తయారవుతుంది. బాడీలోని కెమికల్స్ బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్లు, న్యూరోట్రాన్స్మీటర్స్ సృష్టించడానికి బ్రెయిన్‌కి ఇది అవసరం. అంతేకాకుండా బాడీ మొత్తమంతా ఆక్సీజన్ అందుతుంది. బాడీ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. మీ బ్రెయిన్, వెన్నెముక, ప్రెగ్నెంట్స్‌కి కూడా మంచిది.

డీహైడ్రేషన్ లక్షణాలు

ఎవరైనా డీహైడ్రేషన్‌తో బాధపడితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

పిల్లలు పెద్దలు
  1. నాలుక, పెదాలు డ్రైగా మారడం
  2. ఏడ్చినా కన్నీళ్ళు రావు.
  3. చర్మంపై ముడతలు రావడం
  4. లోతు, రాపిడ్ బ్రీథింగ్
  5. కాళ్ళు, చేతులు చల్లగా మారతాయి.
  • తలనొప్పి, మతిమరుపు, గందరగోళం
  • అలసట, మైకం, బలహీనత
  • హార్ట్‌బీట్ పెరగడం, బీపి తగ్గడం
  • ఆకలి లేకపోవడం
  • షుగర్ క్రేవింగ్స్
  • చర్మం ఎర్రబడడం
  • పాదాల్లో వాపు
  • కండరాల్లో తిమ్మిరి
  • వేడిగా అనిపించడం
  • మలబద్ధకం
  • మూత్రం ముదురు రంగులో రావడం
  • అంతేకాకుండా పిల్లల్లో చెప్పిన లక్షణాలు కూడా కనిపిస్తాయి.

పిల్లల్ని డీహైడ్రేషన్ బారి నుంచి ఎలా కాపాడుకోవాలి?

  1. తల్లిదండ్రులు తమ పిల్లలు రోజంతా తగినతం నీరు తాగేలా చూసుకోవాలి. ఆడుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు వారితో పాటు ఓ వాటర్ బాటిల్ పంపండి. పిల్లలు ప్రత్యక్ష సూర్యకాంతిలో ఎక్కువ సమయం ఉండకుండా చూసుకోండి.
  2. పిల్లల ఆహారంలో పుచ్చకాయ, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ, సొరకాయ, బీరకాయ వంటి వాటిని చేర్చండి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
  3. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లల్ని ఎండలో ఆడుకోవడానికి పంపొద్దు.
  4. పిల్లలు వదులుగా ఉండే దుస్తులు ధరించేలా చూసుకోండి. అంతేకాకుండా లేత రంగు దుస్తులు మంచివి.
  5. పిల్లల శరీరంలో నీటి స్థాయి గణనీయంగా తగ్గితే జాగ్రత్త వహించండి. వెంటనే పీడియాట్రిషియన్‌ని సంప్రదించి తగిన సలహా తీసుకోండి.

డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి?

రోజంతా అంటే 24 గంటల పాటు విరోచనాలు ఉన్నా, గందరగోళంగా ఉన్నా డాక్టర్‌ని కలవాలి. యాక్టివ్‌గా ఉండలేకపోవడం, ద్రవాలను తీసుకోలేకపోవడం, మలంలో రక్తం రావడం, రంగు మారడం, 102 డిగ్రీల పైన ఎక్కువగా జ్వరం ఉంటే డాక్టర్‌ని కలవాలి. ఈ లక్షణాల్లో ఏ లక్షణమున్నా నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే అప్రమత్తమైతే చాలా వరకూ ప్రమాదాన్ని దూరం చేసుకోవచ్చు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dehydration
  • dehydration dizziness
  • dehydration problem
  • Dehydration Risk
  • Dehydration Symptoms
  • drink water in summer
  • health care
  • health care tips
  • Healthy Lifestyle Tips

Related News

Memory loss just ten minutes after having sex with his wife.

Memory Loss: భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే మతిమరుపు

ఎవరికైనా శృంగారం అంటే సంతోషంగా ఉంటుంది. ఇది మానసికంగా, శారీరకంగా ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందని ఆనందిస్తారు. అందుకే జీవిత భాగస్వామితో వారానికి కనీసం రెండుసార్లు అయినా శృంగారంలో పాల్గొనాలని వైద్యులు చెబుతుంటారు. ఐర్లాండ్‌లోని ఒక వ్యక్తి తన భార్యతో అలాగే శృంగారంలో పాల్గొన్నాడు. కానీ ఆ పది నిమిషాలకే ఆయనకు మతి పోయింది. అంటే.. ఆ వ్యక్తికి మతిమరుపు వచ్చేసింది. అదేంటి..

  • What happened as a result of engaging in sex non-stop for five hours?

    Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Follow these tips to prevent illnesses during the monsoon season!

    Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Latest News

  • Cholesterol: కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమే.. అయితే అది ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది?

  • Fuel Price: పెట్రోల్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు

  • Weather Report: నైరుతి ఎఫెక్ట్.. తెలంగాణకు వాతావరణశాఖ బిగ్‌ అలర్ట్‌

  • AP Rains: 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

  • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd