YS Jagan Guntur Tour: గుంటూరు జైలులో వైఎస్ జగన్, టీడీపీ రెడ్‌బుక్‌పైనే దృష్టి
YS Jagan At Guntur Jail: ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, టీడీపీ అవలంబిస్తున్న ఇదే సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని హెచ్చరించారు.
- By Praveen Aluthuru Published Date - 04:23 PM, Wed - 11 September 24

YS Jagan Guntur Tour: గుంటూరు సబ్ జైలులో నిర్బంధంలో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్(Nandigam Suresh)కు సంఘీభావం తెలిపేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు వచ్చారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా జైలుకు వెళ్లి సురేష్‌ను కలిశారు. పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత నాయకుడిని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై అక్రమ అభియోగాలు మోపారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. సురేశ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వంపై జగన్ (YS Jagan) మండిపడ్డారు. ఏపీలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని, ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, టీడీపీ అవలంబిస్తున్న ఇదే సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని హెచ్చరించారు. టీడీపీ నేతలకు కూడా ఇదే గతి పడుతుందని సంచలన కామెంట్స్ చేశారు వైఎస్ జగన్. టీడీపీ రెడ్‌బుక్‌పైనే దృష్టి పెట్టిందని.. ప్రజా సమస్యలపై దృష్టి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ(TDP) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు నందిగం సురేష్. గతంలో వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. నిరసనగా నందిగం సురేష్ సహా కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అప్పట్లో వారిపై కేసులు నమోదయ్యాయి.కాగా ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేయగా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాష్ సహా ఇతర నాయకుల పిటిషన్లను తిరస్కరించింది.
Also Read: Palestine In UN : తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సీటు.. ఇజ్రాయెల్ భగ్గు