HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Zuckerbergs Shocking Decision 16000 Employees Layoffs At Meta

Meta layoffs: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. మెటాలో 16 వేల మంది ఉద్యోగులు లేఆఫ్

  • Author : Vamsi Chowdary Korata Date : 14-03-2026 - 11:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Meta Layoffs
Meta Layoffs

సోషల్ మీడియా దిగ్గజం మెటాలో మరోసారి ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో దూసుకెళ్లేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్న సంస్థ.. ఖర్చులను తగ్గించుకునేందుకు ఏకంగా 20 శాతం మంది సిబ్బందిని తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం, కచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు.

కంపెనీ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ గత కొంతకాలంగా జనరేటివ్ ఏఐపై పూర్తిగా దృష్టి సారించారు. దీని కోసం పరిశోధకులకు భారీ ప్యాకేజీలు ఇవ్వడంతో పాటు డేటా సెంటర్ల నిర్మాణానికి బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న వ్యయాలను నియంత్రించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. “గతంలో పెద్ద బృందం చేసే పనిని, ఇప్పుడు ఏఐ సాయంతో ఒక ప్రతిభావంతుడైన వ్యక్తి చేయగలడు” అని జుకర్‌బర్గ్ ఇటీవలే వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.

డిసెంబర్ 31 నాటికి మెటాలో సుమారు 79,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా ప్రణాళిక అమలైతే దాదాపు 16,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే 2022లో 11,000 మందిని, 2023లో 10,000 మందిని మెటా తొలగించింది. ఈసారి జరగబోయే తొలగింపులు సంస్థ చరిత్రలోనే కీలకమైనవిగా మారనున్నాయి.

కేవలం మెటా మాత్రమే కాదు, ఇతర టెక్ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఈ ఏడాది అమెజాన్ 16,000 మందిని తొలగించగా, ‘బ్లాక్’ అనే ఫిన్‌టెక్ సంస్థ కూడా ఏఐ వినియోగం పెరగడంతో సిబ్బందిని తగ్గించుకుంది. ఏఐ టెక్నాలజీ రాకతో తక్కువ సిబ్బందితోనే అధిక ఫలితాలు సాధించవచ్చని కంపెనీలు భావిస్తుండటమే ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amazon Layoffs
  • Artificial Intelligence (AI)
  • CEO Mark Zuckerberg
  • Facebook Layoffs
  • meta layoffs
  • Meta Layoffs Again
  • Tech industry

Related News

AI Services In AP Government Hospitals

ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

Government Hospitals  ఏపీ ప్రభుత్వం ఏఐ సాయంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 18 ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 40 పరికరాల ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద సరికొత్త ఆవిష్కరణల ద్వారా వైద్య సేవల్లో కీలకమైన స్క్రీనింగ్, కన్ఫర్మేషన్ పరీక్షలు చేస్తున్నారు. ఈ మేరకు తక్కువ సమయంలో వ్యాధులు ఖరారు చేయడం, అత్యుత్తమ వైద్యం అందిచొచ్చని చెబుతున్నారు అధికారులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    Latest News

    • భారత్‎కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్‌ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు

    • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

    • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

    • War Effect : కళ తప్పిన దుబాయ్.. పర్యాటకులు లేక వెలవెల

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd