HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cm Asks Police To Act Firmly To Maintain Law And Order

CM Revanth Reddy Warning: చట్టాన్ని ఉల్లంఘిస్తే తాట తీస్తా : సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

CM Revanth Reddy Warning: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని కోరారు. ఈ రోజు డీజీపీతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయ కుట్రలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని,

  • Author : Vamsi Chowdary Korata Date : 13-09-2024 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy Warning
CM Revanth Reddy Warning

CM Revanth Reddy Warning: విపక్షాల తీరుపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. చట్టాన్ని ఉల్లంగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారికీ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) డీజీపీని కోరారు. ఈ రోజు డీజీపీ(DGP)తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయ కుట్రలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్‌ పార్టీని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీజీపీ జితేందర్ శుక్రవారం నగరంలోని మూడు కమిషనర్లతో సమావేశమై రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నగరంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డీజీపీ సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఉద్ఘాటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే జీరో టాలరెన్స్‌ విధానం ప్రవేశపెడతామని అన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని అన్నారు.

ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. వారి ఇళ్లను ముట్టడించే కార్యక్రమం చేపడుతుంది. ఈ విషయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడికి పాల్పడిన అరెకపూడి గాంధీ, అతని మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావు, ఇతర బిఆర్‌ఎస్ నాయకులు గురువారం పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు పోలీసు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాగ్వాదం సందర్భంగా కౌశిక్ రెడ్డి అడిషనల్ డీసీపీని తోసి తన అంతు చూస్తానని బెదిరించాడని ఆరోపించారు.

Also Read: Money Make Sick: డబ్బు లెక్కింపులో ఈ పొరపాటు జ‌ర‌గ‌కుండా చూసుకోండి.. లేకుంటే ఆరోగ్య‌ స‌మ‌స్య‌లే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • dgp
  • hyderabad
  • law and order
  • police
  • telangana
  • telugu news
  • warning

Related News

Massive arrangements for the Farmers' Blessing Meeting

Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక నిర్మాణం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సభా ప్రాంగణం వద్ద మరియు పరిసర ప్రాంతాలలో ఎలాం

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd