Whiskey Ice Cream: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విస్కీ ఐస్ క్రీమ్ కుంభకోణం
చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు ఇష్టపడని పిల్లలంటూ ఎవరూ ఉండరు. జలుబు చేస్తుందని హెచ్చరిస్తున్నా..డాక్టర్లు వద్దని అంటున్నా..రహస్యంగా కొనుక్కున ఆస్వాదిస్తుంటారు. అయితే చిన్నారుల వీక్ నెస్ ని ఇంకోలా క్యాష్ చేసుకోవాలని కొందరిలో దుర్మార్గమైన ఆలోచన మెదిలింది.
- By Praveen Aluthuru Published Date - 12:33 PM, Fri - 6 September 24
Whiskey Ice Cream: హైదరాబాద్ మహా నగరంలో రోజురోజుకి కల్తీ ఎక్కువైపోతోంది. అయితే ఇప్పుడు కల్తీ రాయుళ్లు ఓ ముందడుగేసి చిన్న పిల్లలను టర్గెట్ చేస్తున్నారు. లోకజ్ఞానం తెలియని చిన్నారులకు చిన్న వయసులోనే మద్యం రుచిని పరిచయం చేస్తున్నారు. ఐస్‌క్రీమ్ అంటే అమితంగా ఇష్టపడే చిన్నారులను టార్గెట్ చేస్తూ ఐస్‌క్రీమ్‌లో విస్కీని కలిపి అమ్ముతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఈ కుంభకోణం బయటపడింది.
చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు ఇష్టపడని పిల్లలంటూ ఎవరూ ఉండరు. జలుబు చేస్తుందని హెచ్చరిస్తున్నా..డాక్టర్లు వద్దని అంటున్నా..రహస్యంగా కొనుక్కున ఆస్వాదిస్తుంటారు. అయితే చిన్నారుల వీక్ నెస్ ని ఇంకోలా క్యాష్ చేసుకోవాలని కొందరిలో దుర్మార్గమైన ఆలోచన మెదిలింది. ఎవరికీ అనుమానం కలగకుండా ఐస్ క్రీమ్ లో విస్కీ కలపి సప్లై చేస్తున్నారు. పైగా ఇవి స్పెషల్ రేటంటూ అమ్ముతున్నారు. ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒకానొక ఐస్ క్రీమ్ పార్లర్ లో కొంతకాలంగా యథేచ్ఛగా అమ్ముతున్నారు. ఈ ఐస్ క్రీమ్ మంచి రుచిగా ఉండటంతో ఒకటికి నాలుగు సార్లు ఇదే పార్లర్ కు వచ్చి పిల్లలు కొనుగోలు చేస్తున్నారు. అయితే కీలక సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఐస్ క్రీమ్ పార్లర్ పై దాడులు నిర్వహించారు.
తాజాగా హైదరాబాద్ లో బయటపడ్డ ఐస్‌క్రీమ్ కుంభకోణంలో అరవై గ్రాముల ఐస్ క్రీమ్ లో షుమారు వంద మిల్లీ లీటర్ల విస్కీ అమ్ముతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఈ ఐస్ క్రీమ్ లు పిల్లలే కాదు యువకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం కలగకుండా ఈ వ్యాపారాన్ని నడిపిస్తూ కోట్లు గడిస్తున్నారు. పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ లను అరెస్టు చేశారు.
Also Read: Vaddepalli Krishna : సినీగేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత..