US Trip Purely Personal, DK Shivakumar: బరాక్ ఒబామా, కమలా హారిస్‌లతో డీకే శివకుమార్ భేటీ ?
US Trip Purely Personal, DK Shivakumar: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లను కలవబోతున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలల్లో వాస్తవం లేదని, తన అమెరికా పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15 వరకు కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్తున్నానని
- By Praveen Aluthuru Published Date - 09:09 AM, Mon - 9 September 24

US Trip Purely Personal, DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన పర్యటనపై రాజకీయ దుమారం మొదలైంది. డీకే శివకుమార్ తన అమెరికా పర్యటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఉపాధ్యక్షుడు కమలా హారిస్‌తో పాటు మరికొందరు నేతలను కలవబోతున్నారని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తలను డీకే శివకుమార్ తోసిపుచ్చారు.
ఇది నా వ్యక్తిగత ప్రయాణం:
తన అమెరికా పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15 వరకు కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్తున్నానని, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లను కలవబోతున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలల్లో వాస్తవం లేదని, ఇది వ్యక్తిగత పర్యటన అని ఆయన అన్నారు.
డీకే లేఖ:
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాకు లేఖ కూడా విడుదల చేశారు. అమెరికా పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆయన ఈ లేఖ రాశారు. రాజకీయ ఆహ్వానం వల్ల కాదు, దయచేసి ఎలాంటి ఊహాగానాలకు పాల్పడకుండా ఉండమని నేను ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Also Read: Fuel Tanker Collides With Truck : 48 మంది సజీవ దహనం.. ట్రక్కు, ఆయిల్ ట్యాంకర్ ఢీ