Sri Lanka Navy Arrested Indian Fishermen: 14 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ
Sri Lanka Navy Arrested Indian Fishermen: అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటి నేడుంతీవు సమీపంలో చేపలు పట్టినందుకు శ్రీలంక నేవీ మత్స్యకారులను అరెస్టు చేసింది.ఈ క్రమంలో మత్స్యకారులకు చెందిన మూడు పడవలను శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకుంది.
- By Praveen Aluthuru Published Date - 12:55 PM, Sun - 8 September 24

Sri Lanka Navy Arrested Indian Fishermen: 14 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మత్స్యకారుల పడవలను కూడా నేవీ జప్తు చేసింది. శ్రీలంక నావికాదళం అరెస్టుకు నిరసనగా తమిళనాడు(Tamil Nadu)లోని పుదుకోట్టై జిల్లా జెగతపట్టినంలో ఆదివారం మత్స్యకారుల కుటుంబాలు మరియు స్థానిక ప్రజలు నిరసన తెలిపారు.
శనివారం రాత్రి మత్స్యకారులను అరెస్టు చేసినట్లు సమాచారం. బాధిత కుటుంబాలు మాట్లాడుతూ.. భారతీయ జాలర్లను అరెస్ట్ చేయడం ద్వారా మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళడానికే భయపడుతున్నారని వారు చెప్తున్నారు. తమ బాధలను అర్ధం చేసుకుని ప్రభుత్వం జీవనోపాధిని కల్పించాలని కోరుతున్నారు. తీవ్ర పరిస్థితి తలెత్తినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటి నేడుంతీవు సమీపంలో చేపలు పట్టినందుకు శ్రీలంక నేవీ మత్స్యకారులను అరెస్టు చేసింది.ఈ క్రమంలో మత్స్యకారులకు చెందిన మూడు పడవలను శ్రీలంక నావికాదళం (Sri Lanka Navy) స్వాధీనం చేసుకుంది. శ్రీలంకలో కొద్దిరోజుల జ్యుడీషియల్ కస్టడీ తర్వాత మత్స్యకారులను విడుదల చేసినా.. బోట్లను మాత్రం విడుదల చేయడం లేదు. మరిన్ని బోట్లను లంక ప్రభుత్వం జప్తు చేస్తుంది. కాగా 14 మంది మత్స్యకారులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులు వీధుల్లో కూర్చొని నిరసనలు తెలిపారు.
అరెస్టయిన మత్స్యకారుల్లో మహదేవన్ పడవలో ఉన్న ప్రదీప్, రంజిత్, ప్రభాకరన్, అజిత్ ఉన్నారు. సెంథిల్‌కుమార్ పడవలో ఉన్న విశ్వ, ఆనందరాజు, ఆనందబాబు, కుబేంద్రన్, శేఖర్, మణికందన్ పడవలో ఉన్న మణికందన్, ముత్తుకుమార్, సెల్లతంబి, సెల్వం, సురేష్ ఉన్నారు. అరెస్టు చేసిన మత్స్యకారులను శ్రీలంకలోని కంకేసంతురై నావికా స్థావరానికి తరలించినట్లు తమిళనాడు తీర ప్రాంత పోలీసు అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన దాదాపు 84 మంది మత్స్యకారులు శ్రీలంక అధికారుల అదుపులో ఉన్నారు.
Also Read: PM Modi : 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోడీ