Hertz Tower Demolition Video: 15 సెకన్లలో 22 అంతస్తుల భవనాన్ని కూల్చేసిన అమెరికా ప్రభుత్వం
Hertz Tower Demolition Video: అమెరికాలోని లేక్ చార్లెస్‌లోని కాల్కాసియు నది ఒడ్డున ఉన్న అందమైన భవనం నేలకూలింది. ,అమెరికా ప్రభుత్వం బాంబులతో ఈ భవనాన్ని కూల్చివేసింది. ఈ భవనం గత నాలుగు దశాబ్దాలుగా డౌన్‌టౌన్ లేక్ చార్లెస్‌లో ప్రధాన ఆకర్షణగా ఉంది. కేవలం 15 సెకన్లలో 22 అంతస్తుల భవనం నేలమట్టమైంది.
- By Praveen Aluthuru Published Date - 11:13 AM, Sun - 8 September 24

Hertz Tower Demolition Video: అమెరికాలోని లూసియానాలోని లేక్ చార్లెస్‌లో ఉన్న 22 అంతస్తుల హెర్ట్జ్ టవర్‌ని ప్రభుత్వం కూల్చేసింది. ఈ భవనం గత నాలుగేళ్లుగా ఖాళీగా ఉంది. 2020లో లారా మరియు డెల్టా తుఫానుల కారణంగా భవనం భారీగా దెబ్బతింది. అప్పటి నుంచి ఖాళీగా ఉంది. ఈ భవనాన్ని గతంలో క్యాపిటల్ వన్ టవర్ అని పిలిచేవారు. నాలుగు దశాబ్దాలుగా ఈ భవనం నగరానికి ల్యాండ్ మార్క్ గా మారింది. కానీ తుఫాను తర్వాత అంతా మారిపోయింది. లేక్ చార్లెస్ మేయర్ నిక్ హంటర్ సమక్షంలో 22 అంతస్తుల భవనం కేవలం 15 సెకన్లలో శిధిలాల కుప్పగా మారింది.
Read Also: Aryna Sabalenka: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా సబలెంకా..!
కొన్నేళ్లుగా భవనం యజమాని మరియు లాస్ ఏంజిల్స్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ హెర్ట్జ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ దాని బీమా ప్రొవైడర్ జ్యూరిచ్‌తో న్యాయ పోరాటం చేసింది. భవనాన్ని పునరుద్ధరించడానికి యజమాని 167 మిలియన్ డాలర్లు అంచనా వ్యయం డిమాండ్ చేశారు. అయితే ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిన తరువాత ప్రభుత్వం భవనం కూల్చివేసింది.
The Hertz Tower implosion
Safety & travel info: https://t.co/Bgr93vDuuM pic.twitter.com/rDMTvP2r2O
— Kathryn Shea Duncan (@kat_dunc) September 7, 2024
2020 లో లారా హరికేన్ కారణంగా లేక్ చార్లెస్ ప్రాంతంలో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నగరం కాల్కాసియు నది ఒడ్డున ఉంది. హ్యూస్టన్ నుండి రెండు గంటల దూరంలో ఉంది. ఇక్కడ దాదాపు 80,000 జనాభా నివసిస్తున్నారు.
Read More: Heavy Flood Inflow To Budameru Vagu : విజయవాడకు మరో టెన్షన్..