HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Elon Musk Makes Shocking Comments About Whatsapp

వాట్సాప్ పై ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 27-01-2026 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Meta Can Read Private WhatsApp Chats
Meta Can Read Private WhatsApp Chats

Elon Musk  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్‌లను మాతృ సంస్థ ‘మెటా’ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

  • యూజర్ల ప్రైవేట్ మెసేజ్‌లను మెటా యాక్సెస్ చేయగలదని ఆరోపణ
  • వాట్సాప్ సురక్షితం కాదంటూ వివాదంలోకి ఎలాన్ మస్క్
  • వాట్సాప్ ప్రైవసీ విధానంపై అమెరికా కోర్టులో దావా
  • ఆరోపణలు పూర్తిగా అబద్ధమని కొట్టిపారేసిన మెటా సంస్థ

Meta Can Read Private WhatsApp Chats వాట్సాప్‌ ప్రైవసీపై తీవ్ర ఆరోపణలు.. కోర్టులో దావా! అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో ఈ నెల‌ 23న ఈ దావా దాఖలైంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాలకు చెందిన కొందరు యూజర్లు ఈ పిటిషన్ వేశారు. వారి ఆరోపణల ప్రకారం వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానం కేవలం ఒక బూటకం. మెటా ఉద్యోగులు అంతర్గత టూల్స్ ఉపయోగించి యూజర్ల చాట్స్‌ను యాక్సెస్ చేయగలరని వారు ఆరోపించారు. యూజర్ ఐడీ ఆధారంగా ఇంజినీర్ల అనుమతితో మెసేజ్‌లను దాదాపు రియల్ టైంలో చూడొచ్చని, చివరకు డిలీట్ చేసిన కంటెంట్‌ను కూడా వీక్షించగలరని ఆరోపణల్లో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలకు మద్దతుగా పిటిషనర్లు ఎలాంటి సాంకేతిక ఆధారాలను కోర్టుకు సమర్పించలేదు.

ఆరోపణలను ఖండించిన మెటా
ఈ దావాను మెటా సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా తప్పుడు, అసంబద్ధమైన ఆరోపణలని కొట్టిపారేసింది. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ పకడ్బందీగా పనిచేస్తుందని, ఎన్‌క్రిప్షన్ కీలు కేవలం యూజర్ల డివైజ్‌లలోనే ఉంటాయని స్పష్టం చేసింది. అందువల్ల తాము గానీ, తమ ఉద్యోగులు గానీ మెసేజ్‌లను డీక్రిప్ట్ చేయడం లేదా చదవడం సాంకేతికంగా అసాధ్యమని మెటా పునరుద్ఘాటించింది.

వాట్సాప్ సురక్షితం కాదు: మస్క్
ఈ వివాదంలోకి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ప్రవేశించారు. ‘వాట్సాప్ సురక్షితం కాదు’ అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించిన ఆయన, ఇతర ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల విశ్వసనీయతను కూడా ప్రశ్నించారు. దీనికి బదులుగా తమ ‘ఎక్స్ చాట్’ ఫీచర్‌ను ప్రయత్నించాలని యూజర్లకు సూచించారు. ఈ కేసు విచారణలో ఎలాంటి ఆధారాలు బయటకు వస్తాయోనని టెక్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Data Privacy
  • Data Security
  • elon musk
  • End to end Encryption
  • Message security
  • social media
  • whatsapp
  • WhatsApp Privacy
  • X chat

Related News

Girl Harassment

వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Kakinada Girl  సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే… ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి,

    Latest News

    • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

    • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

    • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

    Trending News

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd