KL Rahul: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ ఎందుకు ఓపెనింగ్ చేయాలి? రీజన్స్ ఇవేనా?
టెస్టు క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ కెరీర్ మొత్తం హెచ్చు తగ్గులతో సాగింది. అయితే తన కెరీర్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు.
- By Gopichand Published Date - 05:27 PM, Tue - 3 December 24

KL Rahul: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 6న అడిలైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ మళ్లీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కనిపిస్తాడా? లేదా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ లేకపోవడంతో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ (KL Rahul) కనిపించాడు. పెర్త్ టెస్టు మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశాడు. ఇటువంటి పరిస్థితిలో ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో రాహుల్ ఎందుకు ఓపెనింగ్ చేయాలో తెలుసుకుందాం.
టెక్నిక్‌గా ఆడతాడు
టెస్టు క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ కెరీర్ మొత్తం హెచ్చు తగ్గులతో సాగింది. అయితే తన కెరీర్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో పరుగులు సాధించాడు. అంతే కాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బౌలర్లను ఎదుర్కోవడానికి సరైన టెక్నిక్ ఉపయోగించాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బంతిని పాత బంతికి మార్చడంలో రాహుల్ సఫలమైతే.. టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ లాభపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాహుల్‌కి మరోసారి టీమిండియా అవకాశం ఇవ్వనున్నట్లు కథనాలు వస్తున్నాయి.
Also Read: Cracked Heels: ఈ సింపుల్ రెమెడీస్ ఫాలో అయితే చాలు మీ పాదాలు అస్సలు పగలవు!
విదేశాల్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అద్భుతమైన రికార్డు
టెస్టు క్రికెట్‌లో కేఎల్ రాహుల్ సగటు 34.27గా ఉంది. కానీ ఓపెనర్‌గా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో సెంచరీలు సాధించాడు. దీంతోపాటు ఆస్ట్రేలియాలో కూడా సెంచరీ సాధించాడు. ఆ సమయంలో అతను 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. రాహుల్ ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ కారణంగా కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీమ్ ఇండియా అతనికి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అవకాశం ఇస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు.
రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయొచ్చు
KL రాహుల్ తన టెస్ట్ కెరీర్‌ను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ప్రారంభించాడు. దీని తర్వాత అతను 2018-19 వరకు టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కనిపించాడు. అతని పేలవమైన ఫామ్ కారణంగా అతన్ని ఆ స్థానంలో కొనసాగించలేదు. ఇప్పుడు రాహుల్ మరోసారి టెస్టు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో అతని బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు వస్తే అది అతని ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.