Cracked Heels: ఈ సింపుల్ రెమెడీస్ ఫాలో అయితే చాలు మీ పాదాలు అస్సలు పగలవు!
పాదాల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా కొన్ని హోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:21 PM, Tue - 3 December 24

మామూలుగా స్త్రీ పురుషులకు పాదాల పగుళ్ల సమస్య తీవ్ర ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పురుషులు ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోకపోయినా స్త్రీలు మడమల విషయంలో పాదాల పగుళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. రకరకాల చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు పాదాల పగుళ్లు మరింత పెద్దవిగా మారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఏం చేస్తే పాదాల పగుళ్ల సమస్యలు రావో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాదాల పగుళ్లు రాకుండా ఉండటానికి గంజి నీరు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. ఇందుకోసం కొద్దిగా గంజి నీళ్లలో తేనె, కొద్దిగా వెనిగర్ కలిపి ద్రావణాన్ని తయారు చేసి, తర్వాత మీ పాదాలను అందులో10 నిమిషాల పాటు ఉంచాలి.
ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అలాగే అరటిపండ్ల గుజ్జును పాదాలకు మర్దన చేస్తే కూడా పదాలా పగుళ్లు రావు. పగుళ్లు రాకుండా ఉండాంటే అరటిగుజ్జును పాదాల పగుళ్లకు అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పాదాల పగుళ్లు రాకుండా ఉంటాయి. పగుళ్లు కూడా తగ్గిపోతయని చెబుతున్నారు. పాదాల పగుళ్లు రాకుండా ఉండటానికి ఉప్పు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో పాదాలను ఉంచాలి. దీన్ని 20 నిమిషాల వరకు అలాగే ఉంచాలట.
తరచుగా ఇలా చేస్తుండడం వల్ల పాదాల పగుళ్ల సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం మిక్స్ చేసి అందులో పాదాలను ఉంచాలి. ఆ తర్వాత నిమ్మరసాన్ని మీ పాదాలకు బాగా అప్లై చేయాలి,ఇలా చేస్తే పాదాల పగుళ్ళు రాకుండా ఉంటాయి. అదేవిధంగా గ్లిజరిన్, రోజ్ వాటర్, కొద్దిగా నిమ్మరసాన్ని బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పాదాలు అందంగా కనిపిస్తాయి. పగుళ్లు కూడా రావట. పైన చెప్పిన రెమడీలను వారంలో కనీసం రెండు మూడు సార్లు ప్రయత్నించడం వల్ల నెమ్మదిగా పాదాల పగుళ్ల సమస్యలు తగ్గుముఖం పడతాయట.