Rohit Sharma: ముంబై తర్వాత రోహిత్ శర్మ జాయిన్ అయ్యే జట్టు ఇదేనా..? ఆ కోచ్ ఎందుకు అలా అన్నాడు..!
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎప్పుడైనా ఎంఐకి వీడ్కోలు చెప్పగలడని చాలా కాలంగా చర్చ నడుస్తోంది.
- By Gopichand Published Date - 10:55 AM, Tue - 9 April 24

Rohit Sharma: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎప్పుడైనా ఎంఐకి వీడ్కోలు చెప్పగలడని చాలా కాలంగా చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ఫ్రాంచైజీ స్వీకరించి హార్దిక్ పాండ్యాకు ఈ బాధ్యతను అప్పగించినప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌లో అంతా సవ్యంగా లేదనే వార్తలు వస్తున్నాయి. మాజీ కెప్టెన్‌ను ఫ్రాంచైజీ గౌరవించనందున రోహిత్ శర్మ ఎప్పుడైనా ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టవచ్చని మీడియా నివేదికలలో వార్తలు కూడా వచ్చాయి. రోహిత్ ఎంఐకి 5 ట్రోఫీలు అందించాడు. అయినప్పటికీ అతనిని కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇలాంటి పరిస్థితిలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను విడిచిపెడితే అతను ఏ జట్టులో చేరగలడనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. IPL 2024 సందర్భంగా రోహిత్ శర్మకు ఒక ఫ్రాంచైజీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఆటగాడికి ఏ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది?
హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా చేసిన తర్వాత ఫ్రాంచైజీకి అంతా అనుకూలంగా లేదు. ఐపీఎల్ 2024 తొలి మూడు మ్యాచ్‌ల్లో ముంబై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో రోహిత్ శర్మతో పాటు కోట్లాది మంది ముంబై ఇండియన్స్ అభిమానులు హార్దిక్ పాండ్యాను తీవ్రంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో హార్దిక్‌పై వేలకొద్దీ మీమ్స్ చేయడం ప్రారంభించారు. మైదానంలో కూడా ట్రోల్ చేశారు. హార్దిక్ మైదానంలోకి రాగానే రోహిత్-రోహిత్ అంటూ నినాదాలు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఎప్పుడైనా వీడ్కోలు చెప్పగలడని వార్తలు రావడం మొదలయ్యాయి. ఐపీఎల్ 2025లో మెగా వేలం జరగనుంది. రోహిత్ శర్మ ఎంఐని వీడవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. రోహిత్ శర్మ ఎంఐ నుంచి వైదొలిగినట్లు వార్తలు వచ్చినప్పుడల్లా అతను ఇప్పుడు ఏ జట్టులో చేరుతాడు అనే ఒకే ఒక్క ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ IPL 2024 సందర్భంగా రోహిత్ తన జట్టులో చేరడానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.
Also Read: Pakistan Head Coach: పాకిస్థాన్ జట్టు ప్రధాన కోచ్ ఎవరో తెలుసా..?
కోచ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
కేఎల్ రాహుల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో LSG మేనేజ్‌మెంట్ టీమ్‌లోని ఒక సిబ్బంది కోచ్‌ని మెగా వేలంలో ఏదైనా ఒక ఆటగాడిని కొనుగోలు చేసే అవకాశం మీకు లభిస్తే, మీరు ఎవరిని కొనుగోలు చేస్తారు? దీని తర్వాత ఇంటర్వ్యూయర్ రోహిత్ శర్మను మీ టీమ్‌లో చేర్చుకునే అవకాశం మీకు లభిస్తే, మీరు ఏమి చేస్తారని అడిగారు. దీనిపై ఎల్‌ఎస్‌జీ కోచ్ కూడా ఆశ్చర్యపోయాడు. కోచ్ మొదట ఎంఐకి చెందిన రోహిత్ శర్మనా అని అడిగాడు..? ఆపై ఇంటర్వ్యూయర్ అవును అదే రోహిత్ శర్మ అని చెప్పాడు.
దీనిపై కోచ్ ఆశ్చర్యంతో మాట్లాడుతూ అతడిని ఎప్పుడు వచ్చినా ఎల్‌ఎస్‌జీలో చోటు ఉంటుంది. దీన్ని బట్టి లక్నో సూపర్ జెయింట్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేరవచ్చని రోహిత్ శర్మకు ఎల్‌ఎస్‌జీ కోచ్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితిలో రోహిత్ ముంబై ఇండియన్స్ నుండి తప్పుకుంటే,.. LSG అతనిని తమ జట్టులో చేర్చుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి.
We’re now on WhatsApp : Click to Join