Sanju Samson: వార్న్ కోసం కప్ గెలుస్తాం
ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది.
- By Naresh Kumar Published Date - 02:47 PM, Sun - 29 May 22
ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. యువ ఆటగాళ్ళతో కూడిన రాజస్థాన్‌ను దివంగత లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్ ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలోషేన్ వార్న్ కోసం ఈసారి ట్రోఫీ గెలవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది.
గుండెపోటుతో కన్నుమూసిన తర్వాత వార్న్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రాయల్స్ ఇప్పటికే పలు మ్యాచ్‌లలో ఘనంగా నివాళ అర్పించింది. డీవై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో స్టేడియాన్ని వార్న్ చిత్రాలతో అలంకరించడంతో పాటు రాజస్థాన్ సిబ్బంది తమ కాలర్లపై ‘SW23’ ఉన్న షర్టులు ధరించి నివాళులర్పించారు. అయితే ఫైనల్‌కు ముందు వార్న్‌ను గుర్తు చేసుకుంటూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు.
టోర్నమెంట్ ప్రారంభం నుంచి అతను మా వెంటే ఉన్నాడని భావిస్తున్నాం. ఫస్ట్ రాయల్‌గా మా జట్టును అతను నడిపించిన విధానం మాకు ఎప్పటికీ స్పూర్తివంతమే. మేము ఇప్పటికే ఈ సీజన్లో చాలా పురోగతి సాధించాం. అతని కోసం టైటిల్ సాధించాలనే మరో అడుగు వేయాలని భావిస్తున్నామంటూ సంజూ శాంసన్ పేర్కొన్నాడు.
అలాగే ఇది మాకు చాలా ప్రత్యేక సందర్భం. అయినా నేను ఎక్కువగా దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. మేము కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. మేము వార్న్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నామని శాంసన్ భావోద్వేగంతో సందేశమిచ్చాడు. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ ఫైనల్ చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.
ఈ సీజన్లోరాజస్థాన్ రాయల్స్‌కు సారథిగా వ్యవహరించిన వార్న్ టైటిల్ అందించడంతో పాటు విజేతగా నిలిపాడు. అప్పటి టైటిల్ పోరులో చెన్నైని 163 పరుగులకు కట్టడి చేసిన రాయల్స్ ఛేజింగ్‌లో యూసఫ్ పఠాన్ రాణించడంతో చివరి ఓవర్లో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే బెంగళూరుతో ఈ సీజన్లో రెండో క్వాలిఫైయర్ తర్వాత బట్లర్ కూడా వార్న్ గురించి గుర్తు చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ టీం కోసం షేన్ వార్న్ చేసిన సేవ ఎనలేనిదనీ, మొదటి సీజన్లోనే జట్టును విజయపథంలో నడిపించాడని చెప్పాడు.
ఇక అతని మరణం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నాడు. వార్న్‌ను తాము చాలా మిస్సవుతున్నామని, అయితే ఆయన ఎక్కడ ఉన్నా తమ టీం ప్రదర్శన చూసి గర్వపడుతాడని భావిస్తున్నట్టు తెలిపాడు. మొత్తం మీద రాజస్థాన్ రాయల్స్ 15వ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచి టైటిల్‌తో షేన్‌వార్న్‌కు మరోసారి ఘననివాళి అర్పించాలని భావిస్తోంది.
Related News
IPL 2024 : ఉత్కంఠ పోరు లో SRH విజయం
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక రన్ తో ఓటమి చెందింది