విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. నెంబర్ వన్ స్థానం కోల్పోయిన కింగ్!
ఇండోర్‌లో భారత్‌తో జరిగిన మూడో వన్డేలో డెరిల్ మిచెల్ 137 పరుగుల (131 బంతుల్లో) వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆయన ఆదుకున్నారు.
- Author : Gopichand
Date : 21-01-2026 - 7:58 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli: గత వారం ఐసీసీ (ICC) ర్యాంకింగ్స్‌లో నంబర్-1 వన్డే బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, నేడు ఆ స్థానాన్ని కోల్పోయారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెరిల్ మిచెల్ కొత్త నంబర్-1 వన్డే బ్యాటర్‌గా అవతరించారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒక స్థానాన్ని కోల్పోగా, కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని టాప్-10లోకి ప్రవేశించారు.
విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టిన డెరిల్ మిచెల్
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ 93 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు. ఆ ఇన్నింగ్స్ తర్వాత విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఆయన నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే, కేవలం వారం రోజుల్లోనే ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. గత ఆదివారం జరిగిన మూడో వన్డేలో కోహ్లీ 124 పరుగులు చేసినప్పటికీ అదే మ్యాచ్‌లో సెంచరీ బాదిన డెరిల్ మిచెల్ రేటింగ్‌లో కోహ్లీని అధిగమించారు.
Also Read: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కన్నుమూత.. కెరీర్లో 2548 వికెట్లు!
ఇండోర్‌లో భారత్‌తో జరిగిన మూడో వన్డేలో డెరిల్ మిచెల్ 137 పరుగుల (131 బంతుల్లో) వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆయన ఆదుకున్నారు. ప్రస్తుతం మిచెల్ 845 రేటింగ్ పాయింట్లతో తన కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకోగా విరాట్ కోహ్లీ 795 రేటింగ్‌తో రెండో స్థానానికి పడిపోయారు. గత వారం జరిగిన రెండో వన్డేలో కూడా మిచెల్ 131 పరుగులు చేయగా ఆ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమవ్వడం వీరిద్దరి రేటింగ్ పాయింట్ల మధ్య వ్యత్యాసానికి కారణమైంది.
- డెరిల్ మిచెల్- 845 రేటింగ్ పాయింట్స్
- విరాట్ కోహ్లీ- 795
- ఇబ్రహీం జద్రాన్- 764
- రోహిత్ శర్మ- 757
- కేఎల్ రాహుల్- 670 (టాప్-10లోకి చేరారు)